Dark Night Movie Review : డార్క్ నైట్ మూవీ రివ్యూ

Update: 2026-03-13 10:55 GMT

రివ్యూ : డార్క్ నైట్

ఆర్టిస్ట్స్ : పూర్ణ, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) విధార్థ్, సుభాశ్రీ రాయగురు తదితరులు

ఎడిటర్ : ఇళయరాజా ఎస్.

మ్యూజిక్ డైరెక్టర్ : మిస్కిన్

డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : కార్తీక్ ముత్తు కుమార్,

సహా నిర్మాతలు : శ్రీనివాస్ మేదరమెట్ల, జె. కొండలరావు,

నిర్మాత : సురేష్ రెడ్డి కొవ్వూరి,

దర్శకుడు : జి.ఆర్. ఆతిత్య

పూర్ణ ప్రదాన పాత్రలో రూపొందిన  ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “డార్క్ నైట్”.  జి.ఆర్. ఆదిత్య దర్శకుడు. ఈ మధ్యన ఏ న్యూస్ క్రైమ్ న్యూస్ చూసినా భార్య చేతిలో భర్త చావడం, లేదా వైఫ్ లవర్ భర్తను చంపడం కామన్ అయిపోయింది. వీటిపై సోషల్ మీడియా లో మీమ్స్ కూడా పెడుతున్నారు. ఈ జనరేషన్‌  భార్య, భర్తలు  ఇద్దరిలో ఎవరు తప్పటడుగు వేసినా వారి సంసారం ఎంత డేంజర్లో పడుతుందో దానికి ఎంత అలర్ట్‌గా ఉండాలో తెలియచేసే కధాంశంతో రూపొందించిన ఈ చిత్రం ఈ రోజు (మార్చ్ 13న)  థియేటర్లలో విడుదల అయ్యింది.  

 

కథ :

న్యాయవాది అలెక్స్‌ (విధార్థ్) హేమ(పూర్ణ)లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. బట్ వీరి మ్యారేజ్ లైఫ్ లో సంతోషం ఉండదు. కారణం అలెక్స్ కార్యాలయంలో పనిచేసే సోఫియా (సుభాశ్రీ రాయగురు) తో అక్రమ సంబంధం కొనసాగిస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న హేమ అతన్ని విడిచి వెళ్లిపోతుంది. ఇది ఇలా వుండగా సోఫియా వేరే వ్యక్తి జిమ్ లో ట్రైనర్ తో సంబంధం పెట్టుకుంటుంది. తను మోసపోయానని తెలుసుకుని అలెక్స్ తిరిగి వచ్చి హేమ వద్ద క్షమాపణ కోరుతాడు. తన తప్పుపై పశ్చాత్తాపంతో హేమను తిరిగి తన జీవితంలోకి తీసుకోవాలని కోరుతాడు. కాని ఒక సంవత్సరం క్రితం హేమ తన కారణంగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రోషన్ (త్రిగుణ్-ఆదిత్ అరుణ్) అనే అనాధ యువకుడిని కలుస్తుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.  హేమ అతనిలో ఒక మంచి స్నేహితుడిని చూస్తుంది. అయితే రోషన్ మాత్రం ఆ సంబంధాన్ని వేరే విధంగా భావిస్తాడు.  కాని అలెక్స్, హేమ తో తిరిగి ఒకటై అంతా సర్దుకుంటుందనుకునే సమయంలో.... ఒక విషాద సంఘటన జరుగుతుంది. హేమ భర్తను వదిలి వెళ్లిన తర్వాత రోషన్ ఏమి చేస్తాడు? భర్త వుండగా రోషన్.. హేమ రూమ్ లోకి ఎందుకు వచ్చాడు?  అది ఆమె వివాహ జీవితంపై ఎలా ప్రభావం చూపుతుంది? చివరికి హేమ సంతోషంగా జీవిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.

నటన పరంగా చూస్తే :

పూర్ణ అయితే అచ్చ తెలుగు భార్యలా ఓ అందమైన గృహిణిగా, చాలా క్యూట్‌గా కనిపించింది. ఆమె నిరాశ, బాధ, అసహాయత వంటి భావాలను ఎంతో సహజంగా వ్యక్తపరిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మాత్రం ఆమె పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. (ఇక్కడ  క్లైమాక్స్ సన్నివేశాల గురించి చెప్పక పోవడానికి కారణం అది ముందే తెలిస్తే ప్రేక్షకుడికి కిక్ వుందని రివ్యూ లో ప్రస్తావించలేదు).  త్రిగుణ్ పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది ఈ జనరేషన్ కి చెందిన కుర్రవాడిగా చాల జోవియాల్ నటించాడు. భర్త గా  విధార్థ్ తన పాత్ర మేర నటించాడు. తెలుగు అమ్మాయి సుభాశ్రీ రాయగురు తన అందాలతో ఆకట్టుకుంది.

టెక్నికల్ గా చూస్తే :

దర్శకుడు ఆథిత్యా ప్రేమ, నిరాశ, వివాహేతర సంబంధాలు, నేరం వంటి అంశాలతో కూడిన సాధారణ కథను తీసుకున్నప్పటికీ, దాన్ని చెప్పిన విధానం కొంత భిన్నంగా ఉంటుంది. కథలోని పలు అంశాలను ఒక ప్రత్యేక శైలిలో కలిపి చూపించడానికి ఆయన ప్రయత్నించారు. ముఖ్యంగా కథను హేమ దృష్టికోణం నుంచి చెప్పడం ఆసక్తికరంగా ఉంటుంది. హేమకు రోషన్‌పై ఆకస్మికంగా ఏర్పడిన ఆసక్తికి కూడా కొంతవరకు సబబే అనిపించారు. దర్శకుడు కథలో కొన్ని అతీంద్రియ అంశాలతో కూడిన ఒక ఊహించని ట్విస్ట్ కథను కొత్త మలుపు తిప్పుతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. టాప్ డైరెక్టర్ గా మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నాడు.  సినిమాకు సంగీతం అందించిన మిస్కిన్ అందించిన పాటలు బాగున్నాయి. అవి సినిమాలో భావోద్వేగాన్ని పెంచుతాయి. సంగీతంలో ఇళయరాజా  ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుండి క్లైమాక్స్ వరుకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అయ్యింది.  కార్తీక్ ముత్తు కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా రాత్రి సన్నివేశాలు చాలా అధ్బుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాత నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

ఆసక్తికరమైన కథాంశం తో  కథ చెప్పే విధానం, భావోద్వేగాలు మరియు ఉత్కంఠతో కూడిన అంశాలతో “డార్క్ నైట్” ప్రేక్షకులను ఎమోషనల్ థ్రిల్ ఇస్తూ రెండు గంటలపాటు ఉత్కంటభరితంగా పాత్రలతో మమేకం చేస్తుంది. ముఖ్యంగా ఇప్పటి  జనరేషన్లోనున్న యూత్ కు సంభందించిన అంశాలు హైలెట్ గా వారి అనుభవాలను ప్రతిబింబిస్తాయి. ఈ మధ్య చాలా చోట్ల భార్య-భర్తల మధ్య గొడవలు, విడాకులు, ద్రోహం వంటి కథలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం భార్య-భర్తలు ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది బాగా చూపించింది. హజ్బెండ్స్! మీరు సేఫ్‌గా ఉండాలంటే మీ వైవ్స్‌కు ఈ సినిమా తప్పకుండా చూపించాలి అనిపించేలా మంచి మెసేజ్‌తో వచ్చిన మంచి సినిమా. నిజంగా సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌లా భార్యబర్తలు కలిసి చూసే సినిమా అని చెప్పొచ్చు.

ఫైనల్ గా : డార్క్ నైట్ ఇంట్రెస్టింగ్ గా సాగే సినిమా

రేటింగ్ : 2.75/5

Tags:    

Similar News