ఆది సాయికుమార్ హీరోగా నటించిన మూవీ శంబాలా. ఈ మూవీ ముందు నుంచి ఊహించినట్టుగానే బ్లాక్ బస్టర్ అయింది. రిలీజ్ కు ముందే మంచి అంచనాలున్నాయి. వాటిని నిలబెట్టుకుంటూ పెద్ద విజయమే సాధించింది. ఈ నెల 22నుంచి ఓటిటిలో కూడా స్ట్రీమ్ అవుతోందీ మూవీ. దీంతో పాటు కన్నడ, హిందీ భాషల్లో డబ్ అయింది కూడా. ఎలా చూసినా ఆదికి ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇన్నాళ్లుగా సరైన హిట్ పడలేదు. చాలా సినిమాలు పోయాయి.. పోతున్నాయి. ఈ టైమ్ లో వచ్చిన శంబాలాకు మంచి బ్రేక్ రావడం అంటే పెద్ద విషయమే కదా. అయితే ఈ బ్రేక్ ను నిలబెట్టుకుంటూ మరో మంచి కథతో రావాల్సి ఉంది ఆది. బట్ శంబాలాకు సీక్వెల్ గురించిన ఆలోచనలు సాగుతున్నాయి.ఇప్పటికే కథకు సంబంధించిన పనులు మొదలయ్యాయి అని చెబుతున్నారు. ఈ మేరకు అఫీషియల్ గానే ప్రకటించే అవకాశాలున్నాయి.
నిజానికి ఇలాంటి మూవీస్ ను అలా వదిలేయడం ఉత్తమం. హిట్ కదా అని చెప్పి దాన్ని దాటే ప్రయత్నం చేస్తే మొత్తానికే లాస్ తప్పదు. అఫ్ కోర్స్ శంబాలా ఒక ఇంటెన్స్ మూవీ. ఆకట్టుకునే నటీ నటులున్నారు. శ్రీ చరణ్ సంగీతం మెప్పించింది. అన్నిటికీ మించి దర్శకుడు యుగంధర్ ముని వర్క్ పై చాలా అప్లాజ్ వచ్చింది. సో.. దీన్ని మరో మూవీగా మార్చుకోవాల్సిన సినిమాను సీక్వెల్ పేరుతో చెడగొట్టుకోవడం ఎందుకు అనిపిస్తుంది. అసలే ఈ మధ్య సెకండ్ పార్ట్స్ మూవీస్ ఏమీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంకా చెబితే అవి అసలు స్టార్ట్ కూడా కావడం లేదు. ఇలాంటి టైమ్ లో శంబాలా 2 అనడం ఏ మేరకు బావుంటుంది. ఏదేమైనా ఆది సాయికుమార్ మాత్ర ప్రస్తుతం శంబాలా ఫీవర్ లో ఉన్నాడు. దాన్ని అలాగే కంటిన్యూ చేయడం మాత్రం అంత మంచి విషయం మాత్రం కాదేమో అనిపిస్తోంది.