విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ కింగ్ డమ్ ట్రైలర్ ఎప్పుడు..? ఇదే ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ లో కలుగుతున్న సందేహం. అయితే ఈ సందేహానికి సమాధానం రాబోతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపొందిన కింగ్ డమ్ ను సితార, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్. సత్యదేవ్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీలంక నేపథ్యంలో సాగే వార్ బ్యాక్ డ్రాప్ మూవీ అంటున్నారు. తన అన్నను వెదుక్కుంటూ వెళ్లే ఓ తమ్ముడి కథ అని కూడా చెబుతున్నారు. అయితే శ్రీలంకలో ఒకప్పుడు ఉగ్రవాద సంస్థగా ముద్రపడిన ఎల్టీటీఈ కోణం కనిపిస్తుంది అనే టాక్ కూడా ఉంది. ఎల్టీటీఈ గురించి ఈ తరానికి తెలియదు కానీ.. రాజీవ్ గాంధీని హతమార్చింది వాళ్లే. అందుకే ఆ నేపథ్యం అంటున్నప్పుడు చాలామందిలోఓ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. పైగా సినిమాను చాలా భాగం శ్రీలంకలోనే చిత్రీకరించారు.
కింగ్ డమ్ ను ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు. అంటే సరిగ్గా పది రోజులు ఉంది. అయినా ప్రమోషన్స్ పరంగా పెద్దగా సందడి కనిపించడం లేదు. నిర్మాత నాగవంశీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నా.. కింగ్ డమ్ కంటే కూడా ఇతరత్రా అంశాలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. అయితే నాగవంశీ అండ్ టీమ్ కు బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ సినిమా ఈ 24న విడుదలవుతోంది. కింగ్ డమ్ ప్రమోషన్స్ వల్ల ఆ మూవీ హైప్ కాస్త డైల్యూట్ అవుతుందేమో అనే కారణంతోనే వీళ్లు కామ్ గా ఉంటున్నారు అనేవాళ్లూ లేకపోలేదు. అది ఎలా ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం నిర్మాతపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారి కోసమే ఈ న్యూస్. కింగ్ డమ్ ట్రైలర్ ను ఈ నెల 25 నుంచి విడుదల చేయబోతున్నట్టు టాక్. 25న ఓ ఈవెంట్ చేసి ట్రైలర్ ను వదలబోతున్నారట. కుదిరితే హరిహర వీరమల్లు సినిమాతో పాటు ట్రైలర్ ను థియేటర్స్ ల ప్రదర్శించే అవకాశాలూ ఉన్నాయంటున్నారు. దీంతో పాటు ట్రైలర్ తర్వాత ఈ మూవీ గురించి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అన్నీ పటా పంచలు అయిపోతాయని కూడా చెబుతున్నారు. ఆ రేంజ్ లో కట్ చేసి ఉంచారట ట్రైలర్. డైలాగ్స్, ఎమోషన్స్, యాక్షన్, బాగా హైలెట్ అవుతుందంటున్నారు. దానికి మించి అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉంటుందట.