బ్యూటీ క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా 'ఘాటీ'. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. క్రిష్ డైరెక్షన్ లో ఇంతకు ముందు అనుష్క నటించిన వేదం సినిమాలో సరోజ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వేదంలో అనుష్క వేశ్య పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో వస్తోన్న మూవీ ఇదే కావడంతో పాటు ప్రస్తుతం అనుష్క సోలోగా సత్తా చాటే ప్రయత్నాల్లో ఉండటంతో పాటు రీసెంట్ గా వచ్చిన ఘాటీ గ్లింప్స్ లో ఆమె నట విశ్వరూపం చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. ఓ రేంజ్ మాస్ అవతార్ లో కనిపించబోతోంది దేవసేన అని ఫిక్స్ అయ్యారు.
ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ లో సాగే కథగా చెప్పాడు క్రిష్. అవమానాలు దాటుకుని లెజెండ్ గా మారిన ఓ మహిళ కథ అని చెప్పాడు. అయితే ఈ చిత్రంలో మేల్ లీడ్ గా ఎవరు నటించబోతున్నారు అనే టాక్ కూడా ఇప్పటి వరకూ రాలేదు. ఎందుకంటే అంతా అనుష్కే అవుతుందనుకున్నారు. బట్ తాజాగా క్రిష్ ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ చిత్రంలో అనుష్కతో పాటు తమిళ్ స్టార్ విక్రమ్ ప్రభు కూడా ఓ క్రూషియల్ రోల్ చేయబోతున్నాడని ప్రకటించాడు. ఇవాళ విక్రమ్ ప్రభు బర్త్ డే సందర్భంగా అతను ఇంటెన్స్ తో ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు.ఈ పోస్టర్ చూస్తుంటే విక్రమ్ ప్రభు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాడీ చిత్రంలో అనిపిస్తుంది. పాత్ర పరిధి ఏదైనా పవర్ ఫుల్ గా ఉంటుందనిపిస్తోందీ పోస్టర్ చూస్తుంటే.
ఇక ప్యాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు క్రిష్. టైటిల్ అన్ని భాషలకూ సెట్ అయ్యేలా ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అయితే సమ్మర్ లో ఏప్రిల్ 18న విడుదల చేయబోతుండటం మరో ప్లస్. సమ్మర్ హాలిడేస్ ఘాటీకి కచ్చితంగా కలిసొస్తాయి అని చెప్పొచ్చు.