Matka : మట్కా గట్టెక్కుతుందా..

Update: 2024-11-12 10:30 GMT

వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మట్కా ఈ నెల 14న విడుదల కాబోతోంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1960ల నుంచి 1980ల వరకూ సాగే పీరియాడిక్ డ్రామా. ఆ కాలంలో దేశవ్యాప్తంగా మట్కా అనే జూదం చాలా ఫేమస్. ఆ జూదంలోని మెళకువలన్నీ నేర్చుకున్న సాధారణ స్థాయి నుంచి మట్కా కింగ్ గా ఎదిగిన వాసు అనే వ్యక్తి జీవితంలోని వివిధ దశలను చూపుతూ.. అసలు ఈ మట్కా అనేది ఏ తరహాలో ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది అనే పాయింట్ ఖచ్చితంగా ఆడియన్స్ కు కొత్త అనుభూతిని ఇచ్చేదే. ఆ మాటకొస్తే ఈ తరహా పాయింట్ తో ఇప్పటి వరకూ తెలుగులో సినిమాలు రాలేదు. కాకపోతే పాయింట్ వేరు.. ప్రెజెంటేషన్ వేరు. ఆ ప్రెజెంటేషన్ కూడా పాయింట్ ఉన్నంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆ మేరకు ఈ మూవీ ట్రైలర్ చూస్తే బలమైన కంటెంట్ అయితే కనిపిస్తుంది.

కాకపోతే కొన్నాళ్లుగా ట్రైలర్ తో సూపర్బ్ అనిపించుకుని సినిమాగా చిరాకు పెట్టినవి చాలానే ఉన్నాయి. మట్కా ఆ కోవలో ఉండదు అనే కోరుకుందాం. అయితే వరుణ్ తేజ్ కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ చూస్తున్నాడు. ఇటు కరుణ కుమార్ చివరి రెండు సినిమాలు కూడా డిజాస్టర్స్. ఈ సినిమాకు ఏకైనా ప్లస్ పాయింట్ కంటెంట్. అది కరెక్ట్ గా ఉంటే బాక్సాఫీస్ జూదంలో మట్కా గెలుస్తుంది. కంగువా తప్ప పెద్దగా పోటీ లేదు. పైగా నవంబర్ 14న గురువారం.. పబ్లిక్ హాలిడే. లాంగ్ వీకెండ్ కూడా కలిసొస్తుంది. సో.. సినిమాలో విషయం ఉంటే.. విజయం తథ్యం. 

Tags:    

Similar News