Actor Chandra Mohan: శోభన్ బాబు వద్దంటున్నా వినకుండా ఆపని చేశా: చంద్రమోహన్
Actor Chandra Mohan: హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు నటుడు చంద్రమోహన్.;
Actor Chandra Mohan: హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు నటుడు చంద్రమోహన్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి పలు విశేషాలు పంచుకున్నారు. ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చానే కానీ, నటుడు అవ్వాలని రాలేదని అన్నారు. ఆస్తులు కూడబెట్టిన నటుడిగా ఎప్పుడూ తన పేరు వినిపిస్తుంటుందని, అయితే ఇందులో వాస్తవం లేదని అన్నారు.
అప్పట్లోనే నగర శివారులో 35 ఎకరాల భూమిని కొన్నా. మద్రాసులో 15 ఏకరాల ల్యాండ్ ఉండేది. శోభన్ బాబు వద్దంటున్నా వినిపించుకోకుండా ఆ ల్యాండ్ అమ్మేశాను. ఆర్థిక అవసరాలు ఏవీ లేకపోయినా వాటిని చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో అమ్మేయాల్సి వచ్చింది. దానికి గురించి ఇప్పుడు అనుకోవడం కూడా అనవసరం.
నాకు కొడుకులు లేరు. కూతుళ్లు విదేశాల్లో స్థిరపడ్డారు. నేను పోగొట్టుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుంది. ఇక ఆమధ్య స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే తనకు ఏదో జరిగిందని తప్పుడు వార్తలు రాశారు. బతికుండగానే మరణించినట్లు అసత్య ప్రచారం చేశారు. ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తారు. సినిమా వాళ్ల విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంటుంది అని చంద్రమోహన్ వాపోయారు.