Amy Jackson : బ్రిటీష్ నటుడితో అమీ జాక్సన్ సీక్రెట్ డేటింగ్..!
Amy Jackson : నటి, బ్రిటీష్ మోడల్ అమీజాక్సన్ మళ్ళీ ప్రేమలో పడిందట.. బ్రిటీష్ నటుడు ఎడ్‌వెస్ట్విక్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది.;
Amy Jackson : నటి, బ్రిటీష్ మోడల్ అమీజాక్సన్ మళ్ళీ ప్రేమలో పడిందట.. బ్రిటీష్ నటుడు ఎడ్‌వెస్ట్విక్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు కలిసి గతకొంతకాలంగా సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారట.
గతేడాది డిసెంబర్‌లో సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్‌లో వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ప్రస్తుతం ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కాగా గతంలో అమీజాక్సన్ జార్జ్ పనియోటౌ అనే బిజినెస్‌మెన్‌తో ప్రేమలో పడి అతడితో కొన్ని రోజులు సహజీవనం చేసింది. ఈ జంటకు ఆండ్రూ అనే బాబు కూడా జన్మించాడు. వీరిద్దరు 2020లో వివాహం చేసుకుందామని అనుకున్నారు కానీ కరోనా వలన అది వాయిదా పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో గతేడాది విడిపోయారని వార్తలు వచ్చాయి.
ఇక 'మద్రాసపట్టణం' అనే చిత్రంతో నటిగా వెండితెరకి పరిచయమైంది అమీజాక్సన్.. ఆ తర్వాత తెలుగులో ఎవడు అనే చిత్రంలో మెరిసింది. చివరగా రోబో 2.0లో కనిపించింది.