లోఫర్ హీరోయిన్‌కు బెదిరింపు కాల్స్!
లోఫర్ హీరోయిన్ దిశా పటానీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తనని చంపుతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.;
లోఫర్ హీరోయిన్ దిశా పటానీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తనని చంపుతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీస్ స్టేషన్‌కు కూడా ఫోన్ చేసి దిశాను ఎవరు కాపాడలేరని ఆగంతకులు హెచ్చరించారట. ఈ కాల్స్ అన్నీ పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీని వెనుక ఉన్న సూత్రధారిని కనిపెట్టే పనిలో ఉన్నారు.
ఇక దిశా పటానీ సినిమాల విషయానికి వచ్చేసరికి ఎమ్‌ఎస్ ధోనీ, భాగీ-2,బాఘీ 3 చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నటించి గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం దిశా సల్మాన్ ఖాన్ సరసన 'రాధే' సినిమాలో నటిస్తోంది.