MAA Elections 2021: మంచు విష్ణు ప్యానెల్ సభ్యులపై హేమ పోలీస్ కంప్లైంట్..
MAA Elections 2021: ఇంతకు ముందు మా ఎన్నికలు అనేవి ఒకటి ఉంటాయని, వాటి కోసం ఇంత పోటీ జరుగుతందని చాలామందికి తెలీదు.;
MAA Elections 2021:మా ఎన్నికల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతకు ముందు వరకు మా ఎన్నికలు అనేవి ఒకటి ఉంటాయని, వాటికోసం ఇంత పోటీ జరుగుతందని చాలామందికి తెలీదు. కానీ ఈసారి జరుగుతున్న మా ఎన్నికలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఒకరి ఎత్తుకు మరొకరి పైఎత్తులు వేస్తూ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి తగినట్టుగానే వారి ప్యానెల్ సభ్యులు కూడా ఎన్నికల విషయంలో చురుగ్గా ఉన్నారు.
మంచు విష్ణుకు ఇండస్ట్రీ నుండి ఎంత సపోర్ట్ ఉందో.. ప్రకాశ్ రాజ్‌కు కూడా అంతకు సరిసమానంగానే ఉంది. వీరిద్దరి ప్యానెల్స్‌లో ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తులు ఉన్నారు. మా ఎన్నికల వల్ల వీరు ఒకరిని ఒకరు దూషించుకుంటూ శత్రువుల్లా మారారు. ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన నరేశ్, హేమల మధ్య విభేదాలు తలెత్తాయి. తాజాగా హేమ నరేశ్‌పై పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చింది.
సీనియర్ నటి హేమ.. ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా ఆయన ప్యానెల్ తరపున పోటీ చేస్తోంది. నరేశ్.. మంచు విష్ణు ప్యానెల్‌లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇటీవల నరేశ్, కరాటే కళ్యాణి కలిసి పలు ఇంటర్వ్యూల్లో తన గురించి అసభ్యంగా మాట్లాడారని హేమ పోలీసులను ఆశ్రయించింది. వారిద్దరిపై కంప్లయింట్ ఇస్తూ వారు తనను బెదిరించారని వెల్లడించింది. ఇలా రోజుకొక మలుపు తిరుగుతున్న మా ఎన్నికల్లో చివరికి అధ్యక్ష పదవి ఎవరి చేతికి దక్కుతుందో..