గతనెల 20న బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహణలో నటి హేమ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురితో కలిసి ఆమె రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. ఇందులో డ్రగ్స్ కూడా వాడినట్లు తేలడంతో పార్టీలో పాల్గొన్న వారందరికీ టెస్టులు నిర్వహించారు. అందులో 86 మందికి పాజిటివ్‌గా తేలింది. వారిలో హేమ కూడా ఉండటంతో తాజాగా ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫామ్‌హౌస్‌లో హేమను అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచే హేమ వీడియో రిలీజ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.హేమ వీడియో రిలీజ్ చేయడంతో పాటు ఫామ్‌హౌస్‌లో పార్టీ జరుగుతున్నదని తెలిసికూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెబ్బగోడి పీఎస్‌కు చెందిన ఏఎస్సై నారాయణస్వామి,హెడ్ కానిస్టేబుల్ గిరీశ్, కానిస్టేబుల్ దేవ రాజుపై సస్పెన్షన్ వేటుపడింది.
ఎలక్ట్రానిక్ సిటీలోని జేబీ ఫామ్‌హౌస్‌లో న్యూసెన్స్ చేస్తున్నట్టు పలువురు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉన్నతాధికారుల విచారణలో తేలింది. దీంతో బెంగళూరు సీపీ దయానంద ముగ్గురిని సస్పెండ్ చేశారు. పార్టీలో పాల్గొన్న వారితో పాటు డ్రగ్స్ తీసుకున్న వారిని శనివారం నుంచి విచారించనున్నారు.