Malashri : ఆ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను .. మాలాశ్రీ కంటతడి
Malashri : సినీ నటి మాలాశ్రీ హీరోయిన్ గా అందరికీ సుపరిచితురాలే.. ప్రేమఖైదీ, సాహసవీరుడు సాగరకన్య, బావ బావమరిది మొదలగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
Malashri : సినీ నటి మాలాశ్రీ హీరోయిన్ గా అందరికీ సుపరిచితురాలే.. ప్రేమఖైదీ, సాహసవీరుడు సాగరకన్య, బావ బావమరిది మొదలగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న టైంలో కన్నడకి వెళ్లి అక్కడ యాక్షన్, లవ్ మూవీస్ చేసి అక్కడే స్థిరపడిపోయింది. అయితే మళ్ళీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది.
అలీతో సరదాగా షోలో పాల్గొన్న మాలాశ్రీ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సాహసవీరుడు సాగరకన్య మూవీ చేశాక కన్నడలో బిజీ అయిపోయానని తెలిపింది. అయితే ఓ రోజు తనతో సినిమా చేయాలనీ నిర్మాత రాము అడగడంతో ఆయనతో ముత్యనంత హెంతి (ముత్యం లాంటి పెళ్లాం) అనే మూవీ చేశానని తెలిపింది. అయితే ఈ సినిమా ప్రెస్ మీట్ లో ఆయనకు ముత్యంలాంటి పెళ్లాం దొరకాలని చెప్పానని చివరకు తానే ఆయనకు భార్యనవుతానని అనుకోలేదని తెలిపింది.
ప్రేమఖైదీ మూవీ సూపర్ హిట్ కావడంతో నిర్మాత రామానాయుడు తనకి హీరో హరీష్ కి ఖరీదైన వాహనాలను బహుమతిగా ఇచ్చాడన్న విషయాన్ని వెల్లడించింది. ఇక తన భర్త రాము చనిపోవడం ఇప్పటికి నమ్మలేకపోతున్నానని ఎమోషనల్ అయింది మాలాశ్రీ.. ఇక మాలాశ్రీ చెల్లలు శుభశ్రీ కూడా నటినే... జెంటిల్ మేన్, పెదరాయుడు, ముత్తు మొదలైన చిత్రాలలో నటించింది.