ప్రముఖ నటి, నిర్మాత రాధిక శరత్‌కుమార్ అనారోగ్యంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మొదట సాధారణ జ్వరం అని భావించినప్పటికీ, వైద్య పరీక్షల అనంతరం ఆమెకు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయింది. జూలై 28న ఆసుపత్రిలో చేరిన రాధిక, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పూర్తిగా కోలుకునే వరకు ఆమె ఆగస్టు 5 వరకు ఆసుపత్రిలోనే ఉంటారని వైద్యులు తెలిపారు. రాధిక అస్వస్థతకు గురైన విషయం తెలియగానే ఆమె అభిమానులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఆందోళన చెందారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆమె కూతురు రాయానే మిథున్ కూడా తన తల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే ఇంటికి వస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. రాధిక త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు ఆశిస్తున్నారు.