Actress Sameera Reddy : ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న నటి సమీరా రెడ్డి
దాదాపు 13 ఏళ్ల తర్వాత నటి సమీరా రెడ్డి తిరిగి సినిమాల్లోకి రానున్నారు. ఆమె రీఎంట్రీ ప్రాజెక్ట్ పేరు చిమ్ని. ఇది ఒక సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో ఆమె కాళీ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆమె తన కూతురిని కాపాడుకోవడానికి ఒక దుష్టశక్తితో పోరాడే తల్లి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా హిందీలో రూపొందుతోంది. ఈ చిత్రానికి గగన్ పూరి దర్శకత్వం వహిస్తున్నారు. సమీరా రెడ్డి చివరిగా 2012లో "తేజ్" అనే హిందీ సినిమాలో నటించారు. ఆ తర్వాత కుటుంబం, పిల్లల పెంపకంపై దృష్టి పెట్టారు. అయితే, ఆమె కుమారుడు తన పాత సినిమాలు చూసి, "నువ్వు ఇప్పుడు ఇలా లేవు, మళ్ళీ ఎందుకు నటించడం లేదు?" అని అడిగిన తర్వాతే, తిరిగి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు సమీరా రెడ్డి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాతో ఆమె తన కెరీర్‌లో తొలిసారిగా పూర్తిస్థాయి హారర్ జానర్‌లో నటిస్తున్నారు.ఆమె సినిమా సెట్‌లో ఉన్నప్పుడు నరాలు కంగారు పడ్డానని, మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సినట్లుగా అనిపించిందని అన్నారు. "యాక్షన్" అని చెప్పగానే తనలోని నటి తిరిగి మేల్కొందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కేవలం మూడు వారాల్లోనే పూర్తయిందని ఆమె చెప్పారు.త్వరలో ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు.