Shalini Pandey : ఐ లవ్ యూ విజయ్ : షాలినీ పాండే
Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రను ఎవ్వరూ మర్చిపోలేరు. ఒక డీసెంట్ అమ్మాయిగా షాలినీ పాండే అద్భుతంగా నటించారు.
Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రను ఎవ్వరూ మర్చిపోలేరు. ఒక డీసెంట్ అమ్మాయిగా షాలినీ పాండే అద్భుతంగా నటించారు. అయితే అర్జున్ రెడ్డి సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆగస్టు 25న రిలీజ్ అయి బాక్సాఫీస్‌లో భారీ కలెక్షనన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ విజయదేవరకొండకు, షాలినీ పాండేకు మంచి పేరుతో పాటు అవకాశాలను అందించింది. ఈ సందర్భంగా షాలినీ పాండే విజయ్‌కు కృతజ్ఞతలు చెప్పింది. 'లైగర్.. నీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా.. లవ్ యూ.. నీ కొత్త సినిమా లైగర్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని షాలినీ పాండే చెప్పుకొచ్చింది.
అర్జున్ రెడ్డి షూటింగ్‌లో తాను కంగారు పడినప్పుడల్ల విజయ్ తనలో ఉత్సాహాన్ని నింపి షూటింగ్ సరదాగా గడిచిపోయేలా చేశాడని షాలినీ పాండే చెప్పుకొచ్చింది. అర్జున్ రెడ్డి సినిమా 2017 ఆగస్టు 25న రిలీజ్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. 5 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా బాక్సాఫీస్‌లో సుమారు రూ.50 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది.