NBK107 : ఫిక్స్.. బాలయ్య సరసన శృతిహసన్...!
NBK107 : నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.;
NBK107 : నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇందులో బాలయ్య గెటప్ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ముందునుండిగా హీరోయిన్‌గా శృతిహసన్ పేరు వినిపిస్తోంది.
తాజాగా దీపావళి సందర్భంగా మేకర్స్ ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం. కాగా క్రాక్, వకీల్ సాబ్ చిత్రాల సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదుంది శృతిహాసన్. ప్రస్తుతం ప్రభాస్ సరసన సాలార్ మూవీ చేస్తోంది. ఇప్పుడు బాలయ్య సినిమాలో మేరవనుంది. అటు అఖండ సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకొంది.