Vishnu Vinyasam : విష్ణు విన్యాసంలో విషయం ఏంత..?

Update: 2026-02-26 07:17 GMT

శ్రీ విష్ణు ఈ మధ్య కాలంలో పట్టిన హిట్ అవుతుంది. మాగ్జిమం హిట్స్ తోనే కెరీర్ లాగిస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ కి కింగ్ అనిపించుకున్నాడు. వైవిధ్యమైన కథలతో పాటు కామెడీకి పెద్ద పీటలు వేస్తున్నాడు. ఆ క్రమంలో ఒకేసారి రెండు మూవీస్ తో రావాలనుకున్నాడు. మృత్యంజయ్, విష్ణు విన్యాసం మూవీస్ ఒకే టైమ్ లో విడుదల కావాల్సి ఉంది. బట్ పెద్దలంతా మాట్లాడి.. మృత్యంజయ్ ని ఒక వారం వెనక్కి నెట్టారు. ఆ కారణంతో విష్ణు విన్యాసం మరికొన్ని గంటల్లోనే విడుదల కాబోతోంది. మరి ఈ మూవీలో విషయం ఏ మేరకు ఉంటుంది అనేది చూస్తే.. శ్రీ విష్ణు గత సినిమాల్లాగే కంటెంట్ తో పాటు కామెడీ కూడా పుష్కలంగా ఉండబోతోంది మూవీలో అనిపించేలా ఉంది ట్రైలర్. ట్రైలర్ తోనే మాగ్జిమం మూవీని ప్రామిసింగ్ అనిపించాడు. తండ్రికేమో డబ్బు పిచ్చి.. హీరోకేమో వాస్తు పిచ్చి ఉన్నవాడుగా కనిపిస్తున్నాడు. మరి అతని వాస్తు పిచ్చి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటీ.. అనేది మెయిన్ పాయింట్ లాగా ఉంది. ఈ పాయింట్ తోనే ఏకంగా తను ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తే ఏం జరగబోతోంది అనేలా ఉంది. ఈ పాయింట్ తో మాత్రమే కాక మిగతా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కూడా యాడ్ అయ్యేలా ఉంది మూవీ ట్రైలర్. ఈ సినిమాతో శ్రీ విష్ణు మరో విజయాన్ని ఖాయంగా అందుకోబోతున్నాడు అనిపించేలా ఉంది.

శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఇద్దరి జంట బావుంది. యధునాథ్ మారుతి రావు దర్శకత్వం వహించిన ఈ మూవీని సుమంత్ నాయుడు జి నిర్మించాడు. రధన్ సంగీతం అందించాడు. మరి ఈ మూవీ ఏ మేరకు ఆడియన్స్ కు ఆకట్టుకుంటుందో తెలియదు కానీ.. ట్రైలర్ మాత్రం ప్రామిసింగ్ గా ఉంది.

Tags:    

Similar News