Aditi Shankkar : సింగర్ నుంచి నటిగా టాప్ డైరెక్టర్ కూతురు..
Aditi Shankkar : టాప్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్‌కు మంచి సినిమాలే వచ్చిపడుతున్నాయి;
Aditi Shankkar : టాప్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుుడు నటిగా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవళ కార్తి హీరోగా 'విరుమన్' మూవీ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. అందులో అదితి హీరోయిన్‌గా మొదటి సారి ఎంట్రీ ఇవ్వనుంది.
ఇప్పుడు అదితి రెండో చిత్రం 'మావీరన్'.. శివకార్తికేయన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ బుధవారం నుంచి ప్రారంభమైంది. తెలుగులో 'మహావీరుడు' టైటిల్‌తో రిలీజ్ కానుంది. మొడొన్నె అశ్విన్ దర్శకత్వం వహించనుండగా భరత్ శంకర్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.