మల్టీ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నుంచి చాలా గ్యాప్ వచ్చింది. వచ్చిందా తీసుకున్నాడా అనేది పక్కన పెడితే ఆ మధ్య డెకాయిట్, గూఢచారి 2 చిత్రాలతో హడావిడీ చేశాడు. వీటిలో డెకాయిట్ కొంత భాగం చిత్రీకరించిన తర్వాత హీరోయిన్ శృతి హాసన్ తప్పుకుంది. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ను తీసుకుని మళ్లీ షూటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లోనే ఉన్నాడు శేష్. అయితే ఎప్పుడో అనుకున్న గూఢచారి 2 మాత్రం బాగా ఆలస్యం అవుతుంది. నిజానికి గూఢచారి తోనే శేష్ ఏంటీ అనేది టాలీవుడ్ కు తెలిసింది. అంతకు ముందు క్షణం వంటి మూవీ ఉన్నా.. లిమిటెడ్ బడ్జెట్ తో అతను రూపొందించిన గూఢచారి (దర్శకుడు శశికిరణ్ టిక్కా అయినా అంతా తనే చేసుకున్నాడు అంటారు) టాలీవుడ్ ను మెస్మరైజ్ చేసింది. అందుకే ఆ మూవీకి సీక్వెల్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం సీక్వెల్ అనౌన్స్ చేశారు. విలన్ గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీని, ఫస్ట్ పార్ట్ లో ఉన్న ప్రకాష్ రాజ్, మధుశాలినీతో పాటు ఈ సారి వామికా గబ్బిని ఫీమేల్ లీడ్ లో తీసుకున్నారు దర్శకుడు ఈ సారి వినయ్ కుమార్ సిరిగినీడిని ఎంచుకున్నాడు శేష్. మొత్తంగా ఈ చిత్రం ఈ యేడాదే ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారు. బట్ లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు శేష్. ఈ చిత్రాన్ని 2026 మే 1న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించాడు. అంటే రిలీజ్ డేట్ చాలా దూరమే వెళ్లింది. మరి అంత దూరం వెళ్లడానికి కారణాలేంటో కానీ ఈ సారి అతనికి కావాల్సిన బడ్జెట్ లోనే సినిమా రూపొందబోతోంది. అంటే గూఢచారి కంటే ది బెస్ట్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.