Urvashi Rautela : బాలయ్య తర్వాత ఎన్టీఆర్ తో ఆఫర్ కొట్టేసిందిగా

Update: 2025-02-24 07:45 GMT

బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ తో మొదలై చిన్న పాత్రల వరకూ వచ్చిన బ్యూటీ ఊర్వశీ రౌతేలా. తెలుగులోనూ అంతే. వాల్తేర్ వీరయ్య మూవీలో చేసిన ఐటమ్ సాంగ్ బాగా గుర్తింపు తెచ్చింది. ఆ గుర్తింపుతోనే బాలయ్య మూవీ డాకూ మహారాజ్ లో ఆఫర్ అందించింది. అఫ్ కోర్స్ ఈ రెండు సినిమాలకూ దర్శకుడు బాబీనే. అతని ద్వారానే రెండో ఛాన్స్ వచ్చిందనుకోవచ్చు. అయితే బాలయ్య తర్వాత అమ్మడు ఇప్పుడు అబ్బాయ్ మూవీలోనూ ఆఫర్ అందుకుందనే వార్తలు వస్తున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న మూవీలో ఊర్వశీ రౌతేలాను కూడా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ఓపెనింగ్ రోజునే వందలాదిమందితో మొదలుపెట్టాడు నీల్. త్వరలోనే ఈ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని నాన్ స్టాప్ గా షూట్ చేస్తారని ఆల్రెడీ వినిపిస్తోంది. 2026 జనవరి 9న విడుదల చేయాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేట్ మారకుండా చూసుకుంటారట. 1960ల కాలంలో బెంగాల్ నేపథ్యంలో ఈ కథ ఉండబోతోందనే రూమర్స్ తెగ వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత ఊరమాస్ గెటప్ తో కనిపిస్తాడట.

అతని సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టోవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరితో పాటు కేవలం ఐటమ్ సాంగ్ కే పరిమితం కాకుండా కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఊర్వశీ రౌతేలాను తీసుకున్నారంటున్నారు. అదే నిజమైతే.. ఈ ప్యాన్ ఇండియా మూవీతో ఊర్వశికి మరింత పేరు రావడం ఖాయం.

Tags:    

Similar News