కార్పోరేట్ బుకింగ్స్.. ఈ మాట ఈ డెకేడ్ లోనే స్టార్ట్ అయింది. ఒక పెద్ద సినిమా.. విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమా రిలీజ్ అవుతుందంటే.. కొన్ని కార్పోరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం థియేటర్స్ కు థియేటర్స్ బుక్ చేసి సినిమాలు చూపిస్తుంటాయి. దీనివల్ల బల్క్ లీవ్స్ ఉండవు. ఎంప్లాయీస్ కూ కొత్త జోష్ ఉంటుంది. ఇది బాహుబలి నుంచి స్టార్ట్ అయింది. కార్పోరేట్ కంపెనీలు థియేటర్స్ బుక్ చేసుకుని మరీ తమ ఉద్యోగులకు ఫ్రీగా సినిమాలు చూపించాయి. ఆ తర్వాత రజినీకాంత్ కబాలి సినిమాకూ అదే జరిగింది. కబాలి కోసం చెన్నైలో అనేక సంస్థలు ఇలా థియేటర్స్ ను బుక్ చేసుకున్నాయి. తర్వాత ఆ స్థాయి సినిమాలు రాలేదు అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ టైమ్ లో కూడా ఇది వినిపించలేదు. బట్ ఇన్నాళ్లకు మళ్లీ రజినీకాంత్ కూలీ కోసం చెన్నైలో కార్పోరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయట. ఈ విషయాన్ని అక్కడి థియేటర్స్ ఓనర్స్ మీడియా ముఖంగా చెబుతున్నారు. కొన్ని థియేటర్స్ అయితే ఏకంగా ఆదివారం వరకూ బుక్ అయిపోయి ఉన్నాయట. అంటే కూలీకి ఆ రేంజ్ లో క్రేజ్ ఉందనుకోవచ్చు. అందుకు ఓ కారణం లోకేష్ కనకరాజ్ అయితే.. మరో కారణం స్టార్ కాస్ట్.
తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మళయాలం నుంచి సౌబిన్ షబీర్ హిందీ నుంచి ఆమిర్ ఖాన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నాడు. ఇవన్నీ సినిమాకు విపరీతమైన క్రేజ్ ను తెచ్చాయి. ఇక మోనికా సాంగ్ తో మాస్ తో పాటు క్లాస్ ను కూడా ఊపేస్తున్నాడు అనిరుధ్. మొత్తంగా చాలా రోజుల తర్వాత చెన్నైలో కార్పోరేట్ బుకింగ్స్ కనిపిస్తున్నాయంటున్నారు.