Rajinikanth : తన పొలిటికల్ ఎంట్రీపై రజినీ ఏమన్నారంటే..?
Rajinikanth : రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అనేదీ తనకు లేదని సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి స్పష్టం చేశారు.;
Rajinikanth : రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అనేదీ తనకు లేదని సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి స్పష్టం చేశారు. చెన్నైలో గవర్నర్ RN రవితో భేటీ అయిన ఆయన.. దాదాపు అరగంట పాటు అనేక అంశాలపై చర్చించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రజినీ… గవర్నర్‌ను కేవలం మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వెల్లడించారు.
భేటీలో రాజకీయాల గురించి కూడా చర్చించినా… అది తన రాజకీయ ప్రవేశం గురించి అయితే కాదని తేల్చిచెప్పారు. 2017 లో కూడా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన చేశారు. రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో.. రాజకీయ రంగ ప్రవేశం ఆలోచనలను రజినీ పూర్తిగా విరమించుకున్నారు.