Aishwarya Rajesh : ఐశ్వర్య మెస్మరైజ్.. ఫొటో షూట్స్ తో అట్రాక్ట్

Update: 2025-04-10 07:00 GMT

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న చిన్నది ఐశ్వర్య రాజేశ్. పేరుకు తెలుగమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా తమిళ చిత్రాల్లో మాత్రమే నటించింది ఈ ముద్దుగుమ్మ. స్పోర్ట్స్ డ్రామా కౌసల్య కృష్ణమూర్తితో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత టక్ జగదీశ్, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ సినిమాలు చేసినా.. ఇవి అంతగా మెప్పించలేదు. కానీ ఏ మూవీకి రాని క్రేజ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో పాటు తమిళ, మలయాళ వరుసగా చాన్స్ లు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐశ్వర్య కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగ అనే తమిళ సినిమాలతో పాటు ఉత్తరాఖండ అనే ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ తన ఫొటో షూట్స్ తో అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. పట్టుచీర కట్టులో ఫొటోలకు పోజులిచ్చి మెస్మరైజ్ చేసింది. ఈ పోస్టుకు ఐశ్వర్య ఓ క్యాప్షన్ ఇచ్చింది. 'నువ్వు చేయగలవని నమ్మితే సగం దూరం వెళ్లగలవు' అని జోడించింది. ప్రసెంట్ ఈభామ షేర్ చేసిన పిక్స్ తెగ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News