Aishwaryaa : హాస్పిటల్‌లో జాయిన్ అయిన ధనుష్ మాజీ భార్య..!
Aishwaryaa : కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ కుమార్తె, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య హాస్పిటల్‌లో జాయిన్ అయింది.;
Aishwaryaa : కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ కుమార్తె, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య హాస్పిటల్‌లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ ధరించాలని సూచించింది. ఇక 2022 తనకోసం ఇంకేం తెస్తుందో చూస్తాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఐశ్వర్య. అటు ధనుష్ కుడా ఇటీవలే కరోనా బారిన పడ్డారు. కాగా ఐశ్వర్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక గత నెలలో ఐశ్వర్య, ధనుష్ విడిపోతున్నట్టుగా వెల్లడించారు. ఇప్పటికీ ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.