Akash Puri : ఆకాశ్ జగన్నాథ్ అయ్యాడు !

Update: 2024-07-26 05:35 GMT

టాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్ టాలెంట్స్‌లో యంగ్ హీరో ఆకాష్ పూరి ఒకడు. ‘మెహబూబా, రొమాంటిక్’ , చోర్ బజార్ వంటి చిత్రాలలో యాక్టింగ్ అండ్ డ్యాన్స్ లో తన టాలెంట్ నిరూపించుకున్నాడు. అయితే ఈ కుర్రోడి తదుపరి ప్రాజెక్ట్‌పై ఇంకా ప్రకటన రాలేదు.

ఈరోజు ఆకాష్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ ప్రత్యేక సందర్భంలో.. అతను సోషల్ మీడియాలో యాక్టివేట్ అయ్యాడు. తనకు తానుగా పేరు మార్చుకుంటున్నాననే తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇక నుంచి ఆకాష్ పూరిని ఆకాష్ జగన్నాధ్ అని పిలవండి అని తన అభిమానులకు సూచించాడు.

ఇప్పుడు ఆకాష్.. అదిరిపోయే కథాంశాలు కలిగిన అనేక సూపర్ ప్రాజెక్ట్‌లను లైన్ లో పెట్టుకోవడంపై దృష్టిసారించాడు. ఆకాష్ జగన్నాధ్ ఇటీవలే దుస్తుల బ్రాండ్ ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ (RC Trendsetters) బ్రాండ్ అంబాసిడర్‌గా ఎండార్స్‌మెంట్ ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News