Akhanda 2 : కుంభమేళాలో అఖండ–2 షూటింగ్

Update: 2025-01-17 13:30 GMT

బాలకృష్ణ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా అఖండ - 2. బోయపాటి శ్రీను దర్శ కత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యింది. 2021లో బాల కృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రానికి కొనసాగింపుగా అఖండ2: తాండవం తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతోంది. కుంభమేళాలోనే షూటింగ్ జరుగుతోందని బోయపాటి శ్రీను తెలిపారు. ‘మహా కుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. అఘోరా నేపథ్యంలో సాగే కథ ఇది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు వచ్చాం. జనవరి 11 నుంచి ఇక్కడే ఉన్నాం. నాగసా ధువులు, అఘోరాలను కలిశాం. మా ప్రయత్న లోపం లేకుండా చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేం -దుకు అన్ని విధాల శ్రమిస్తున్నాం' అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Tags:    

Similar News