Naga Chaitanya Tweet : ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది : నాగచైతన్య
Naga Chaitanya Tweet: సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య చేసిన తొలి ట్వీట్ ఇదే కావడం విశేషం.;
Naga Chaitanya Tweet : గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న ట్వీట్ చేశాడు. యాక్సిడెంట్ తర్వాత తేజు చేసిన తొలి ట్వీట్ ఇదే.. ఇందులో నాపై, రిపబ్లిక్ మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్ అన్నది చిన్నపదమే. త్వరలోనే మీ ముందుకు వస్తా అంటూ 'థంబ్స్ అప్'సింబల్ ని చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేశాడు.
తేజు చేసిన ఈ ట్వీట్ పై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. అందులో భాగంగా అక్కినేని హీరో నాగచైతన్య దీనిపై స్పందిస్తూ.. ' 'ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.. ప్రేమతో ' అంటూ ట్వీట్ చేశాడు.. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య చేసిన తొలి ట్వీట్ ఇదే కావడం విశేషం. అటు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రం తాజాగా విడుదలై మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. దేవకట్టా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.