Akshay Kumar: 'ది కశ్మీర్ ఫైల్స్'పై అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్.. స్పందించిన డైరెక్టర్..

Akshay Kumar: ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం విడుదలయ్యి ఇప్పటికీ రెండు వారాలు అవుతోంది.;

Update: 2022-03-26 10:45 GMT

Akshay Kumar: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది కశ్మీర్ ఫైల్స్' ఇప్పటివరకు ఉన్న బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలుకొట్టుకుంటూ వెళ్తోంది. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజకీయ ప్రముఖులు, స్టార్ సెలబ్రిటీలు, మామూలు ప్రేక్షకులు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ హీరో మాత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దానికి దర్శకుడు కూడా స్పందించాడు.

కోవిడ్ తర్వాత కొన్ని బాలీవుడ్ సినిమాలు మాత్రమే థియేటర్లలో సందడి చేశాయి. కోవిడ్ దెబ్బ నుండి ఇంకా బాలీవుడ్ కోలుకోలేదని ఆ సినిమాల కలెక్షన్స్ చూస్తే అర్థమవుతోంది. పోస్ట్ లాక్‌డౌన్ తర్వాత బాలీవుడ్‌కు చెప్పుకోదగ్గ ఒక్క హిట్ కూడా పడలేదు. అలాంటి సమయంలోనే బాలీవుడ్ గర్వంగా ఫీల్ అయ్యేలా రిలీజ్ అయ్యింది 'ది కశ్మీర్ ఫైల్స్'.

'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం విడుదలయ్యి ఇప్పటికీ రెండు వారాలు అవుతోంది. అయినా ఈ సినిమా కోసం థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. అందుకే చాలా స్పీడ్‌గా 200 కోట్ల క్లబ్‌లో కూడా జాయిన్ అయ్యింది 'ది కశ్మీర్ ఫైల్స్'. ఇదే సమయంలో అక్షయ్ కుమార్ నటించిన 'బచ్చన్ పాండే' ఈ శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది.

అక్షయ్ కుమార్ సినిమాలకు టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్ల విషయంలో మాత్రం తన సినిమాలు సునామీనే సృష్టిస్తాయి. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్ 'ద కశ్మీర్ ఫైల్స్' ఓ పెద్ద అలలాగా వచ్చి దేశ ప్రజలందరినీ కదిలించింది. ఇంకొక విషయం ఏంటంటే ఇది నా సినిమాను కూడా ముంచేసింది.' అంటూ కామెంట్ చేశాడు అక్షయ్ కుమార్. ఈ వీడియోను దర్శకుడు వివేక్ తన ట్విటర్‌లో షేర్ చేసి థాంక్యూ తెలిపాడు.

Tags:    

Similar News