Alia Bhatt : హారర్ మూవీలో అలియాభట్

Update: 2024-12-06 06:15 GMT

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియాభట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో ఒదిగిపోతుంది. ఏ స్టోరీ అయినా వైవిధ్యభరితంగా ఉండేలా చూసుకుంటుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ మరో హారర్ మూవీలో నటించనుందట. హారర్ కామెడీ యూనివర్స్ లో స్త్రీ, స్త్రీ2, ముంజ్యా, భేడియా వంటి సినిమాలను తెరకెక్కించిన నిర్మాత దినేష్ విజన్. అదే అంశంతో ఛముండా అనే పేరుతో మరో మూవీ షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీలో అలియాభట్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. అందుకు సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో సినిమా రూపుదిద్దు కోనుంది.

Tags:    

Similar News