Alia Bhatt: తగ్గేదే అంటున్న ఆలియా భట్.. ఏకంగా సూపర్ స్టార్‌తో సినిమా..
Alia Bhatt: ఆలియా భట్ తెలుగులోనే మరిన్ని సినిమాలు చేయాలన్న ఆలోచనలో ఉందట.;
Alia Bhatt (tv5news.in)
Alia Bhatt: బాలీవుడ్ భామలు ఇప్పుడు ఏకంగా సౌత్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తు్న్నారు. అందులోనూ ముఖ్యంగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే వారిలో అందరికంటే ముందుంగా ఈ ఛాన్స్ అందుకుంది ఆలియా భట్. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఆలియా.. ఆ మూవీ విడుదల కాకముందే మరో రెండు తెలుగు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది.
ప్రస్తుతం చాలా హైప్‌తో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్‌టీఆర్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ కనిపించనుంది. అంతే కాకుండా ప్రమోషన్స్‌లో కూడా హీరోలతో పాటు సమానంగా, చురుగ్గా పాల్గొంది ఆలియా.
ఆలియా భట్ తెలుగులోనే మరిన్ని సినిమాలు చేయాలన్న ఆలోచనలో ఉందట. అందుకే ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో తనకు హీరోయిన్‌గా ఆఫర్ రాగానే ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. తాజాగా మరో ఆఫర్‌కు కూడా ఆలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. తన యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన జక్కన్న.. తన అప్‌కమింగ్ సినిమాలో ఆలియాకు ఛాన్స్ ఇచ్చినట్టు టాక్.
రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత మహేశ్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో ఆలియాను హీరోయిన్‌గా అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లాంటి స్టార్లతో యాక్ట్ చేసిన ఆలియా.. త్వరలోనే సూపర్ స్టార్‌తో కూడా జోడీకట్టనుందనే వార్త తన తెలుగు ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.