Alia Bhatt, Ranbir Kapoor: అమ్మ కాబోతున్న అలియా భట్..
Alia Bhatt, Ranbir Kapoor: బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియ భట్, రణబీర్ కపూర్‌లు. నాలుగేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న రణబీర్, అలియా ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు.;
Alia Bhatt, Ranbhir Kapoor: బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియ భట్, రణబీర్ కపూర్‌లు. నాలుగేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్లిద్దరూ ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లైన వెంటనే ఎవరి షూటింగ్స్‌లో వాళ్లు బిజీగా ఉన్నారు. పెళ్లై 2,3 సంవత్సరాలైనా గ్యాప్ తీసుకోకుండా అప్పుడే మా జీవితంలోకి ఓ బేబీని ఆహ్వానిస్తున్నామంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
అలియా తాను గర్భం దాల్చిన సంతోషకరమైన వార్తను సోమవారం నాడు సోషల్ మీడియాలో పంచుకుంది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ రూమ్ నుంచి ఫోటోను షేర్ చేస్తూ, "మా బేబీ ..... త్వరలో వస్తుంది" అని క్యాప్షన్ ఇచ్చింది.
ఇటీవల, రణబీర్ అలియాతో తన వివాహం గురించి మాట్లాడుతూ, "ఇది నాకు గొప్ప సంవత్సరం, నేను పెళ్లి చేసుకున్నాను. నా జీవితంలో జరిగిన ఒక అందమైన విషయం అని చెప్పాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో ఈ జంట కనిపించనుంది. ఇక అలియా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. డార్లింగ్స్, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో సహా పలు చిత్రాలను లైన్‌లో ఉంచింది.