Alia Bhatt Remuneration For RRR: 15 నిమిషాల క్యారెక్టర్.. 10 కాల్ షీట్లు.. దానికే అంత రెమ్యునరేషనా..?
Alia Bhatt Remuneration For RRR: దర్శక ధీరుడు రాజమౌళి ఆఫర్ అందుకోగానే ఆలియా కాదనకుండా యాక్సెప్ట్ చేసింది.;
Alia Bhatt (tv5news.in)
Alia Bhatt Remuneration For RRR: ఈమధ్య సీనియర్ హీరోయిన్లు మాత్రమే కాదు.. యంగ్ బ్యూటీలు కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న పాలిసీని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే.. ఎప్పుడు ఏ ఇండస్ట్రీ నుండి ఏ భామ వచ్చి ఆఫర్లను తన్నుకుపోతుందో అర్థం కావట్లేదు. అందుకే హీరోయిన్లు ఇంతకు ముందులాగా తమ క్యారెక్టర్ అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అని ఏం అనుకోకుండా.. ఏ ఆఫర్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నారు.
బాలీవుడ్ భామ ఆలియా భట్ కూడా ఇదే తోవలో నడుస్తోంది. ఇంతకు ముందు సౌత్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ వారికి చాలా చిన్నచూపు ఉండేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ భామలు దాదాపుగా తెలుగు నుండి పిలుపు ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌కు వచ్చి వాలిపోదామా అని ఆలోచిస్తున్నారు. అందుకే దర్శక ధీరుడు రాజమౌళి ఆఫర్ అందుకోగానే ఆలియా కాదనకుండా యాక్సెప్ట్ చేసింది.
ఆర్ఆర్ఆర్ సినిమా గురించి దాదాపు ప్రతీ భాషలోని మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. అందుకే రాజమౌళి కూడా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలన్న ఉద్దేశ్యంతో అజయ్ దేవగన్, ఆలియా భట్ లాంటి వారిని కాస్ట్ చేసుకున్నారు. అయితే తాజాగా ఆలియా భట్ పాత్ర ఓ ఆసక్తికర కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తోంది. అయితే ఇందులో తాను చేస్తున్న సీత పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదట. కేవలం పది నిమిషాలు మాత్రమే సినిమాలో మనం ఆలియాను చూసే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే ఈ 15 నిమిషాల క్యారెక్టర్‌ను చేయడానికి ఆలియా కేవలం 10 కాల్ షీట్లను మాత్రమే కేటాయించిందట. దానికే తాను రూ. 5కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్. అంటే తాను రోజుకి రూ. 50 లక్షలు ఛార్జ్ చేసిందనమాట.