Alia Bhatt: 'ఆ టాలీవుడ్ స్టార్ నాకు ఇన్‌స్పిరేషన్': ఆలియా భట్
Alia Bhatt: 'గంగూబాయి కతియావాడి'లో తన నటనకు ఒక టాలీవుడ్ స్టార్ ఇన్‌స్పిరేషన్ అని తాజాగా రివీల్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ;
Alia Bhatt (tv5news.in)
Alia Bhatt: ఈ ఏడాది ఆలియా భట్‌కు బాగా కలిసొచ్చింది. ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది ఆలియా. అంతే కాకుండా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే తనకు ఎక్కడలేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. అందుకే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా బిజీ కావాలనుకుంటోంది ఆలియా. అయితే 'గంగూబాయి కతియావాడి' సినిమాలో తన నటనకు ఒక టాలీవుడ్ స్టార్ ఇన్‌స్పిరేషన్ అని తాజాగా రివీల్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
ఆలియా భట్ తెలుగులో 'ఆర్ఆర్ఆర్'తో పాటు హిందీలో 'గంగూబాయి కతియావాడి'తో కూడా హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఓ వేశ్య పాత్రలో నటించి అందరూ తన క్యారెక్టర్‌కు కనెక్ట్ అయ్యేలా చేసింది. చాలాకాలం తర్వాత ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. అయితే ఈ సినిమాలో అలాంటి పాత్రలో ఒదిగిపోయేలా నటించడానికి తనకు అల్లు అర్జున్ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు అంటోంది ఆలియా.
గంగూబాయి కతియావాడి కథతో సంజయ్ లీలా భన్సాలీ తన దగ్గరకు వచ్చినప్పుడు తనకు కథ నచ్చినా కూడా ఆ పాత్ర కోసం ఏం చేయాలో ఆలియాకు అర్థం కాలేదట. అలాంటి సమయంలోనే అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా విడుదలయ్యిందట. ఆ సినిమాలో అల్లు అర్జున్ మాస్ క్యారెక్టరైజేషన్ చూసి తాను కూడా గంగూబాయి కతియావాడిలో మాస్ యాక్టింగ్ చేసిందని బయటపెట్టింది ఆలియా.