Geetha Arts : మరో విషాదంలో అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత మృతి..
గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ బాల్య స్నేహితుడు, ప్రముఖ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సి. నాగరాజు (76) అనారోగ్యంతో కన్నుమూశారు. చిన్ననాటి నుంచి అరవింద్‌కు అత్యంత సన్నిహితుడైన నాగరాజు, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అనేక చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.కాగా ఇటీవలే తల్లిని కోల్పోయిన అల్లు అరవింద్ తన స్నేహితుడి మరణంతో శోక సంద్రంలో మునిగిపోయారు. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి, అంత్యక్రియలను దగ్గరుండి చూసుకున్నారు. కాగా నాగరాజు మృత దేహానికి ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తో పాటు నిర్మాతలు బండ్ల గణేష్, సురేష్ కొండేటి, బన్నీ వాసు, వంశీ నందిపాటి తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు, అల్లు అరవింద్ కుటుంబానికి ఆయన మరణం తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు.