Allu Arjun : నో డౌట్.. అది ఇంటర్నేషనల్ మూవీయేనట

Update: 2025-05-02 11:30 GMT

స్టార్ హీరోల ప్లానింగ్ సడెన్ గా మారింది అంటే అప్పటి వరకూ ఉన్న ప్లానింగ్ కు మించిన కంటెంట్ ఏదో వచ్చి ఉంటుందని అర్థం అంటుంటారు. పుష్ప 2 ఇండియన్ రికార్డుల బద్ధలు కొట్టిన అల్లు అర్జున్ ఆ వెంటనే ఓ పూర్తి స్థాయి పౌరాణిక చిత్రం చేయాలి. అదీ త్రివిక్రమ్ తో. ఈ ఇద్దరి కాంబోలో ఆల్రెడీ ఓ హ్యాట్రిక్ ఉంది. దాని మీదుగా ఈ పౌరాణికంతో ప్యాన్ ఇండియా రేంజ్ లో వెళ్లాలనుకున్నారు. బడ్జెట్ ను కూడా పెద్దగా ఖాతరు చేయలేదు. ఎంతైనా ఓకే అనేలా ఉన్నారు. అంత ఓకే ఇక అనౌన్స్ మెంటే తరువాయి అనుకునే టైమ్ లో సడెన్ గా ప్లాన్ మారింది. అల్లు అర్జున్ అనూహ్యంగా త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చాడు. సీన్ లోకి తమిళ దర్శకుడు అట్లీ ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు కంటెంట్ లో విపరీతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉంటాయని.. ఓ భారీ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సంస్థతో ఒప్పందం కూడా సెట్ అయింది. వాళ్లూ కథ విని మైండ్ బ్లోయింగ్ అనేశారని వీడియోస్ కూడా చేయించారు. అప్పుడే చాలామందికి ఇదేమైనా సూపర్ హీరో తరహా సినిమానా అనే డౌట్ వచ్చింది. సూపర్ హరోనా కాదా అనేది చెప్పలేం కానీ ఖచ్చితంగా ఇదో హాలీవుడ్ రేంజ్ లో సాగే ఇంటర్నేషనల్ మూవీ అనేది క్లియర్ అంటున్నారు. అంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందబోతోన్న ఇండియన్ మూవీ. అన్నట్టు ఈ కథ సోల్ మాత్రం ఇండియాదేనట. మిగతా అంతా హాలీవుడ్ స్థాయిలో ఉండబోతోందని చెబుతున్నారు. అసలు ఈ ఐడియా నచ్చడం వల్లే అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ ను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు అనేది ఇంటర్నల్ గా వినిపిస్తోన్న మాట. మరి ఈ స్థాయి ఇంటర్నేషనల్ మూవీ చేసిన తర్వాత ఇప్పటి వరకూ ప్యాన్ ఇండియా దర్శకుడు అనే ఇమేజ్ లేని త్రివిక్రమ్ తో నెక్ట్స్ మూవీ మాత్రం చేస్తాడని గ్యారెంటీ ఏంటీ..? అందుకే ఆ మధ్య ఐకన్ స్టార్, మాటల మాంత్రికుడి సినిమా ఆగినట్టే అని రూమర్స్ కూడా వచ్చాయి. సో.. ఇక పుష్ప 2 తో ప్యాన్ ఇండియాను ఊపేసిన అల్లు అర్జున్.. అట్లీతో కలిసి ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకున్నాడన్నమాట.

Tags:    

Similar News