Allu Arjun Bollywood Entry: బాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్.. బన్నీకి బంపరాఫర్

Allu Arjun Bollywood Entry: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. దీంతో బాలీవుడ్ నుంచి ఓ భారీ ఆఫర్ అతడిని వరించింది.

Update: 2022-12-03 10:01 GMT

Allu Arjun: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. దీంతో బాలీవుడ్ నుంచి ఓ భారీ ఆఫర్ అతడిని వరించింది. ఈ మల్టీస్టారర్ సినిమాకు బన్నీ ఓకే చెప్పబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసమే ఇప్పటి వరకూ పుష్ప 2 తర్వాత మరో కొత్త మూవీకి సైన్ చేయలేదట మన స్టార్ హీరో. మరి అల్లు అర్జున్ చేయబోతోన్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ లో మిగతా హీరోలెవరు.. వీరిని డైరెక్ట్ చేయబోతోన్న ఆ బాలీవుడ్ దర్శకుడెవరు..?

అల్లు అర్జున్.. చాలామంది స్టార్స్ నో చెప్పిన డీ గ్లామర్ రోల్ కు ఎస్ చెప్పి పుష్పగా మెప్పించాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పుష్పరాజ్ గురించి మాట్లాడుకుంటున్నారు సినీ ప్రియులు. ప్రస్తుతం పుష్పకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ మూవీ చేస్తున్నాడు బన్నీ. సుకుమార్.. బన్నీ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఎలిమెంట్స్ నూ మిక్స్ చేసి మరింత స్ట్రాంగ్ స్టోరీతో రాబోతున్నాడట.

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి.. అల్లు అర్జున్, రణ్‌వీర్ సింగ్, కార్తితో కలిసి ఓ భారీ మల్టీస్టారర్‌కు ప్లాన్ చేశాడు. మరో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఇదే చిత్రంలో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్ గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారట. ప్రస్తుతం ఇదో పోలీస్ స్టోరీ అని వినిపిస్తోంది. 

Tags:    

Similar News