Raj Tarun : గాడ్స్ అండ్ సోల్జర్స్ లో రాజ్ తరుణ్

Update: 2026-04-11 10:15 GMT

రాజ్ తరుణ్ ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్నాడు. కానీ కొన్నాళ్లుగా మాత్రం అన్నీ ఫ్లాపులు చూస్తున్నాడు. ఎలాంటి కంటెంట్ అయినా ఆడియన్స్ కు కనెక్ట్ కావడమే కష్టమే అయింది. ఓ దశలో నెలలో మూడు నాలుగు సినిమాలు విడుదల చేశాడు. అయినా పోయాయి. ఉన్నంతలో అతని లాస్ట్ మూవీ పాంచ్ మినార్ కాస్త ఫర్వాలేదు అనిపించుకుంది. అది కూడా కమర్షియల్ గా పోయింది. ఇక ఇలా లాభం లేదనుకున్నాడో ఏమో.. ఈ సారి తమిళ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. అతని తమిళ్ లేటెస్ట్ మూవీ గాడ్స్ అండ్ సోల్చర్స్. తాజాగా ఈ గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ నుంచి ట్రైజర్ అని విడుదల చేశారు. అంటే టీజర్ కాదు, ట్రైలర్ కాదు. ఆ రెండూ మిక్స్ అయినట్టుగా ఉండేలా ట్రైజర్ అన్నమాట.

ఈ మూవీలో రాజ్ తరుణ్ తో పాటు చాలామంది ఆర్టిస్టులు ఉన్నాడు. ముఖ్యంగా ఒకప్పడు లవర్ బాయ్ అయిన భరత్ కూడా నటిస్తున్నాడు. 2014లో విడుదలైన సూపర్ హిట్ మూవీ గోలీసోడా దర్శకుడు ఈ గాడ్స్ అండ్ సోల్జర్స్ చిత్రానికీ దర్శకుడు. అతని శైలిలోనే ఈ చిత్రం కూడా ఉండబోతోంది అనిపించేలా ఉందీ ట్రైజర్ చూస్తుంటే. చాలా ఎలిమెంట్స్ ఉన్నట్టుగా అర్థం అవుతోంది. అలాగే సునిల్ కూడా ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ రకంగా ఈ ట్రైజర్ అయితే చాలా బావుంది. రాజ్ తరుణ్ ఓ అమాయకుడైన కుర్రాడుగా మొదలై.. తర్వాత రెబల్ గా మారే పాత్రలో కనిపిస్తున్నాడు. దర్శకుడు స్టైల్ లోనే చాలామంది చిన్న పిల్లలు, టీనేజర్స్ కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. అలాగే భరత్ పాత్ర కాస్త రెబెలియన్ గా ఉన్నాడు. మొత్తంగా ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. మరి ఈ మూవీతో రాజ్ తరుణ్ కు తమిళ్ నుంచి ఏదైనా బ్రేక్ వస్తుందేమో చూడాలి.

Full View

Tags:    

Similar News