బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలే వచ్చే ఆదివారం జరగనుంది. పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఈ మెగా ఈవెంట్‌కు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. విన్నర్‌కు ఆయనే ట్రోఫీ అందజేస్తారని తెలుస్తోంది. ఇవాళో, రేపో దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు టాప్-5 ఫైనలిస్ట్స్‌లో అవినాశ్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్ ఉన్నారు. ఇక వీరిలో బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఎవరు అనేదానిపై ఓటింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్‌లో టాప్ 2 స్థానాల్లో గౌతమ్, నిఖిల్ ఉంటూ వస్తున్నారు. ఈ ఇద్దరిలోనే ఓటింగ్ శాతంలో మార్పులు లేవు కానీ, ఓట్లల్లో స్వల్ప తేడాలు ఉంటున్నాయి. కాబట్టి, విజేత ఎవరు అనేది చివరి వరకు ఆసక్తిగా మారింది. ఈ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ అంతా అన్‌లిమిటెడ్ ట్విస్టులు, అన్‌లిమిటెడ్ ఫన్ అని మొదటి నుంచి నాగార్జున చెబుతున్న విషయం తెలిసిందే. అందుకే గ్రాండ్ ఫినాలేను కూడా బిగ్ బాస్ తెలుగు 8 ఇన్ఫినిటీ ఫినాలే టైటిల్‌తో నిర్వహించనున్నారట.