ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ప్రిస్టీజియస్ మూవీ దసరా బరిలోకి విడుదల కాబోతోంది. యస్.. ఈ మూవీని దసరాకే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ చేయాలనుకున్నారు. బట్ ఆ టైమ్ కు వీళ్లు ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు. అట్లీ డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేశారు. ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా వేగంగా జరిగింది. చిత్రంలో దీపికా పదుకోణ్ కూడా తీసుకున్నారు. చాలా వేగంగా చిత్రీకరణ జరుగుతుంది. మరోవైపు గ్యాప్ వస్తే చాలు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాడు అట్లీ. ఇక ఈ 2026 సమ్మర్ బరిలో చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. ఈ మేరకు షూటింగ్ విషయంలో అస్సలే మాత్రం పెండింగ్ లో ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత మిగతా వర్క్స్ కూడా చేయాలనుకున్నారు.
ఇప్పటికి అయితే చెప్పలేదు కానీ ఈ మూవీని దసరా బరిలో విడుదల చేయబోతున్నారు ప్లానింగ్ లో ఉన్నారు. దసరాకు ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయబోతున్నారు అని చెబుతోంది. ఇక మూవీకి సంబంధించి ఈ చిత్రాన్ని జపనీస్ - బ్రిటీష్ కొరియోగ్రాఫర్ హొకుటో కొనిషీ క్రియేటివ్ టీమ్ లో వర్క్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరణ చేయబోతున్నారు. మొత్తంగా దీపికా పదుకోణ్ అఫీషియల్ గా హీరోయిన్ గా చేస్తోంది. తనతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లు కూడా చేయబోతున్నారు అనే రూమర్స్ అనేవి వినిపిస్తున్నాయి.