Allu Arjun : టాప్ 3లో అల్లు అర్జున్

Update: 2024-12-27 10:15 GMT

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ కు గురైన హీరో అల్లు అర్జున్ కాకుండా ఇండియాలోనే ఇంకెవరూ లేరేమో. ఓవైపు పుష్ప కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు తిరగరాస్తోంది. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్, కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా ఉంది అతని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2. ఈ మూవీ సాధిస్తోన్న వసూళ్లు బాక్సాఫీస్ సూత్రాలు తెలిసిన వారిని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఓ సాధారణ కమర్షియల్ మాస్ మూవీ ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం ఏంటా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

ఈ మూవీతో అల్లు అర్జున్ ఇండియలోనే టాప్ 3లోకి ఎంటర్ అయిపోయాడు. అఫ్ కోర్స్ కలెక్షన్స్ పరంగా ఈ మూవీ మూడో స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో ఇప్పటికీ ఆమిర్ ఖాన్ దబాంద్ సినిమా ఉంది. ఆ తర్వాతి స్థానంలో బాహుబలి 2 ఉంది. ప్రస్తుతం పుష్ప 2 మూవీ 1700 కోట్ల మార్క్ ను దాటేసింది. ఆ రెండు సినిమాల తర్వాత స్థానం పుష్పరాజ్ దే అన్నమాట. అయితే ఈ దూకుడు ఇలాగే కంటిన్యూ అవుతుందనుకుంటున్నారు. అందుకే బాహుబలి 2ను దాటేసినా ఆశ్చర్యం లేదు అనేది ట్రేడ్ అనలిస్ట్ ల అంచనా.

విశేషం ఏంటంటే.. పుష్పరాజ్ హోమ్ గ్రౌండ్ అయిన తెలుగులో మాత్రం ఈ రేంజ్ దూకుడు చూపించలేకపోయాడు. అందుకు ప్రధాన కారణం టికెట్ రేట్లను దారుణంగా పెంచడమే అనేది డిస్ట్రిబ్యూటర్స్ వెర్షన్. ఆ టికెట్ ధరలు చూసి జనం థియేటర్స్ వైపు కూడా చూడాలనుకోలేదు. అందుకే తెలుగులో కలెక్షన్స్ యావరేజ్ గా ఉన్నాయనేది వారి వెర్షన్. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. ఓవరాల్ గా దేశంలోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో టాప్ 3గా నిలిచిందీ మూవీ.

Tags:    

Similar News