Ram Gopal Varma : ఈ వందేళ్లలో బిగ్గెస్ట్ స్టార్ అల్లుఅర్జున్ : రామ్ గోపాల్ వర్మ
అల్లుఅర్జున్ పై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ‘‘1913లో మొదటి సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ‘పుష్ప-2’ లాంటి మూవీ రాలేదు. ఈ వందేళ్లలో బిగ్గెస్ట్ స్టార్, మెగాస్టార్ ఆఫ్ ఇండియా బన్నీ’ అని రాసుకొచ్చారు. కాగా, అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా వచ్చిన ‘పుష్ప-2’ మూవీ డిసెంబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీనిపై ఆర్జీవీ వరుస పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్‌ను ఆకాశానికెత్తేస్తూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన పుష్ప2 రికార్డు కలెక్షన్స్ సాధిస్తుందని సినీ విశ్లేషకుల్లో టాక్ వినిపిస్తోంది. మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ దాదాపు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.