Allu Arjun: మనసు కోరితే తగ్గేదేలే.. స్టైలిష్ స్టార్ కొత్త లుక్
Allu Arjun: మొన్నా ఆ మధ్య అమూల్ బేబి శ్రీవల్లిగా మారిపోయింది.. ఇప్పుడు పుష్పరాజ్ ఏం తినాలని ఉన్నా జొమాటోలో ఆర్డర్ పెట్టేయమంటున్నాడు.;
Allu Arjun: మొన్నా ఆ మధ్య అమూల్ బేబి శ్రీవల్లిగా మారిపోయింది.. ఇప్పుడు పుష్పరాజ్ ఏం తినాలని ఉన్నా జొమాటోలో ఆర్డర్ పెట్టేయమంటున్నాడు. ట్రెండ్‌కి అనుగుణంగా యాడ్ సెట్ చెయ్యాలంతే. అదే ఫాలో అవుతున్నారు మరి తగ్గేదేలే.
సినిమా కోసం కొన్ని నెలలు కష్టపడితే కోట్లలో రెమ్యునరేషన్.. అదే ఓ యాడ్ చేస్తే ఒక్కరోజులో కోట్ల పారితోషికం.. కాదనుకుంటే ఎలా.. హ్యాపీగా యాడ్స్‌లో నటించేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా. తాజాగా పుష్ప సినిమాలోని తగ్గేదేలే కాన్సెప్ట్ తీసుకుని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు అల్లు అర్జున్.
హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఈ యాడ్ షూట్ చేశారు. ఇందులో బన్నీతో పాటు సుబ్బరాజ్ కూడా నటించాడు. వీరిద్దరి మధ్య ఫైట్ సీన్ జరుగుతోంది.. బన్నీ సుబ్బరాజును ఒక్క దెబ్బతో గాల్లోకి లేపుతాడు.. ఆ షాట్ స్లో మోషన్‌లో ఉండగా బన్నీ నన్ను తొందరగా కింద పడేయవా.. గోంగూర, మటన్ తినాలని ఉంది.. కింద పడేలోపు రెస్టారెంట్లన్నీ క్లోజ్ అయిపోతాయి అంటాడు..
దానికి బన్నీ జొమాటో ఉందిగా ఎప్పుడు ఏం కావాలన్నా దొరుకుంతుంది అని చెప్తాడు. జొమాటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్‌గా.. మనసు కోరితే తగ్గేదేలా అంటూ పుష్ప సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్‌తో యాడ్ ముగుస్తుంది. సుబ్బరాజ్, అల్లు అర్జున్ మధ్య జరిగే సంభాషణ చూసి కాసేపు నవ్వుకోవచ్చు. అయితే ఈ యాడ్ బన్నీ లుక్ మాత్రం అద్దిరిపోయింది.. వైట్ షర్ట్‌లో క్యూట్‌గా ఉన్నాడంటున్నారు బన్నీ ఫ్యాన్స్.
manasu korithe, thaggedele! 🔥 @alluarjun pic.twitter.com/i30UGZEQKD
— zomato (@zomato) February 4, 2022