రికార్డులు అని చెప్పాలంటే ఇవాళా రేపు.. సినిమా వాళ్లు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ఫలానా దేశంలో ఇన్ని టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి అని మొదలుపెట్టి.. ఆన్ లైన్ లో టికెట్స్ అమ్మే ప్లాట్ ఫామ్స్ వరకూ.. అన్ని విషయాలను హైలెట్ చేస్తున్నారు. అలాగని వీటిలో ఫేక్ ఏం ఉండదు. అందరికీ కనిపించేదే ఉంటుంది. అందుకే రికార్డులు అనొచ్చు అంటారు. ప్రస్తుతం దేశం మొత్తం అల్లు అర్జున్ హవా కనిపిస్తోంది. పుష్ప 2 తో అతను ఆల్రెడీ వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు. అంతేకాక.. దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ గానూ అవతరించాడు.
ఇక అత్యంత భారీ అంచనాలున్న పుష్ప 2 బుక్ మై షోలో 1 మిలియన్ ఇంట్రెస్ట్ లు, పేటిఎమ్ లో 1.3 మిలియన్ ఇంట్రెస్ట్ లు చూపుతూ మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే ఇంతమంది ప్రేక్షకులు ఈ మూవీ చూడటానికి రెడీగా ఉన్నామని ఆయా ప్లాట్ ఫామ్స్ లో తమ ఇంట్రెస్ట్ ను చూపించారన్నమాట. మామూలుగా పెద్ద సినిమాలకు ఇది రెగ్యులర్ గా కనిపిస్తుంది. అయితే ఇంకా ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ కాకుండానే ఈ రేంజ్ ఇంట్రెస్ట్ లు అంటే రికార్డ్ అనే చెప్పాలి.
పుష్ప 2 పై సౌత్ కంటే నార్త్ లో ఎక్కువ అంచనాలున్నాయి. ఫస్ట్ పార్ట్ అక్కడ ఏకంగా 300కోట్లు వసూలు చేసింది. బట్ తెలుగులో లాస్ అయింది. ఆ మేరకు ఆ లాస్ లు నిర్మాతలే భరించి డిస్ట్రిబ్యూటర్స్ కు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అంటే తెలుగులో లో ఇంకా నార్త్ రేంజ్ బజ్ క్రియేట్ కావాల్సి ఉంది. కాకపోతే తమిళనాడులో రీసెంట్ ఈవెంట్ తో కొంత ఊపు కనిపిస్తోంది. కేరళలో ఎలాగూ అల్లు అర్జున్ కు క్రేజ్ ఉంది. ఇంక దాటాల్సింది తెలుగు ప్రేక్షకులనే.