Allu Arjun Pushpa : ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా అల్లు అర్జున్ 'పుష్ప'...!
Allu Arjun Pushpa : అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'పుష్ప: ది రైజ్' 'ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకుంది.;
Allu Arjun Pushpa : ఆదివారం జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'పుష్ప: ది రైజ్' 'ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకుంది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వార్తను ప్రకటించింది.
ఈ మేరకు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపింది. సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్' డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సినిమాని నిర్మించింది. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఆకట్టుకోగా, శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా మెరిసింది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ లో ఆదరగోట్టింది. అక్కడ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా పుష్ప 2(పుష్ప: ది రూల్) తెరకెక్కుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో మూవీని రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు, అనుపమ టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది.
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2022 పూర్తి విజేతల జాబితా :
సినిమాలు :
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ - పుష్ప: ది రైజ్
ఉత్తమ చిత్రం - షేర్షా
ఉత్తమ నటుడు - రణవీర్ సింగ్
ఉత్తమ నటి - కృతి సనన్
ఉత్తమ దర్శకుడు - కెన్ ఘోష్
ఉత్తమ సహాయ నటుడు - సతీష్ కౌశిక్
సహాయ పాత్రలో ఉత్తమ నటి - లారా దత్తా
ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు - ఆయుష్ శర్మ
విమర్శకుల ఉత్తమ చిత్రం - సర్దార్ ఉదం
విమర్శకుల ఉత్తమ నటుడు - సిద్ధార్థ్ మల్హోత్రా
క్రిటిక్స్ ఉత్తమ నటి - కియారా అద్వానీ
పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ – అభిమన్యు దస్సాని
పీపుల్స్ ఛాయిస్ ఉత్తమ నటి – రాధిక మదన్
బెస్ట్ డెబ్యూ - అహన్ శెట్టి
ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం - మరో రౌండ్
వెబ్ సిరీస్:
ఉత్తమ వెబ్ సిరీస్ - కాండీ
వెబ్ సిరీస్‌లో ఉత్తమ నటుడు - మనోజ్ బాజ్‌పేయి
వెబ్ సిరీస్‌లో ఉత్తమ నటి - రవీనా టాండన్
టెలివిజన్:
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ - అనుపమ
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటుడు - షహీర్ షేక్
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటి - శ్రద్ధా ఆర్య
టెలివిజన్ సిరీస్‌లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ - ధీరజ్ ధూపర్
టెలివిజన్ సిరీస్‌లో అత్యంత ప్రామిసింగ్ నటి - రూపాలీ గంగూలీ
చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సహకారం - ఆశా పరేఖ్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ - పౌలి
ఉత్తమ నేపథ్య గాయకుడు - విశాల్ మిశ్రా
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ - కనికా కపూర్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - జయకృష్ణ గుమ్మడి