రివ్యూ : మోగ్లీ
ఆర్టిస్ట్స్ : రోషన్ కనకాల, బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు తదితరులు
ఎడిటర్ : పీకే
సంగీతం : కాల భైరవ
డివోపి : రామ్ మారుతి
నిర్మాతలు : టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
దర్శకత్వం : సందీప్ రాజ్
కలర్ ఫోటోతో ఆకట్టుకున్న దర్శకుడు సందీప్ రాజ్. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో ఆకట్టుకున్నాడు. బబుల్ గమ్ తో హీరోగా పరిచయం అయ్యాడు సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా మోగ్లీ. బండి సరోజ్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ మోగ్లీ ఎలా ఉందనేది చూద్దాం.
కథ :
పార్వతీపురం ప్రాంతంలో మురళీ కృష్ణ అలియాస్ మోగ్లీ(రోషన్ కనకాల) ఉంటాడు. అతనో అనాథ. ఎస్.ఐ కావాలనే ప్రయత్నంలో ఉంటాడు. అదే క్రమంలో ఆ ప్రాంతంలో షూటింగ్ కు వచ్చే టీమ్స్ కు సపోర్ట్ చేస్తూ సంపాదిస్తుంటాడు. అలా ఓ సారి షూటింగ్ కు వచ్చిన జాస్మిన్ (సాక్షి మడోల్కర్) తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి మూగ, చెవిటి కూడా అయినది. పైగా అనాథ తను. మరి తనలాంటి డ్యాన్సర్ గా మెప్పిస్తూ ఉంటుంది. అదే టైమ్ లో క్రిస్ట్ ఫర్ నోలన్ అనే పార్వతీపురం ఎస్.ఐగా ఉంటాడు. అతను విపరీతమైన కామాంధుడు. అతను జాస్మిన్ ను చూసి మనసు పారేసుకుంటాడు. మరి జాస్మిన్ ను దక్కించుకుంటాడా.. ప్రేమలో గెలుస్తాడా అనేది మిగతా కథ.
ఎలా ఉంది .? :
ఈ కథలో కొత్తదనం కనిపించదు. కథనంలో సైతం ఆకట్టుకునేలా ఉండదు. సింపుల్ గా చూస్తే జయం మూవీ చూసినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే హీరోయిన్ తో మాటలు లేకుండా ఉంచడం ఇందులో కొత్తదనం. ఇక గోపీచంద్ లాగా క్రిస్ట్ ఫర్ నోలన్ లా కనిపిస్తాడు ఈ మూవీలో. కాకపోతే క్రిస్ట్ ఫర్ కేవలం ఆడవాళ్లను వాడుకుంటాడు పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. మొత్తంగా ఈ కథ మొదలైంది కాబట్టి పార్వతీపురం అటవీ ప్రాంతంలో సాగుతుంది. హీరో అడవిలో ఓ దట్టమైన ప్రాంతంలో నివసిస్తుంటాడు. తను సినిమా షూటింగ్స్ కు వచ్చే కాంట్రాక్ట్ దక్కించుకోవడం.. ఇందులో కొత్తదనం. అలా వచ్చిన హీరోయిన్ తో ప్రేమలో పడటం.. అందుకు కారణం ఏంటీ అనేది కూడా తెలియకుండా ఉండటం మాత్రం పాతదనం. చివరికి హీరోయిన్ పై అనుమానం చేసుకున్నాడు.. తర్వాత ప్రేమలో పడటం కొత్తదనం అని ఫీలింగ్. చివరికి విలన్ అతన్ని బంధించడం, వేధించడం.. ఆపై అతనిపై గెలవడం.. అని చూడటం.. దాన్ని అతను నిర్ద్వందంగా ఎదుర్కోవడం మాత్రం చాలా పాత కథనం. సింపుల్ గా చెబితే ఈ మూవీలో ఎలాంటి అంశాల్లోనూ కొత్తదనం కనిపించదు.
వైవా హర్ష పాత్ర మాత్రం బావుంది. అతని ఇచ్చిన ఫినిషింగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఆ మొత్తం సినిమాకే హైలెట్ గా కనిపిస్తుంది. అదే చివరి వరకు తీసుకురావడం ఆకట్టుకుంది. అతనికి ఇచ్చిన డైలాగ్స్ కూడా బావున్నాయి. రోషన్ ది ఏ మాత్రం కొత్తదనం లేని పాత్ర. కానీ ఒకటీ రెండు సీన్స్ లో నటించడానికి ఆస్కారం ఉంది. నటించాడు కూడా. బండి సరోజ్ కుమార్ పాత్ర బావుంది అనిపిస్తుంది.. అదే టైమ్ లో ఓవరాక్షన్ లానూ ఉంది. కేవలం అతను కామాంధుడు పాత్ర గానే కనిపించడం ఏం బావుంది..? హీరోయిన్ బావుంది. తన నటన కూడా ఆకట్టుకుంది. డైలాగ్స్ లేకుండా ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది. ఇతర పాత్రలన్నీ గొప్పగా ఉండదు. కాకపోతే ఆర్టిస్ట్ లను సప్లై చేసే నటుడి మాత్రం నటనతో మెప్పించాడు.
టెక్నికల్ గా మ్యూజిక్ పరంగా మైనస్ అయింది. పాటలే మాత్రం బాలేదు. ఆర్ఆర్ మాత్రం ఫర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ బాలేదు. డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.
ఇక ఈ మూవీ కథ సరంగా సందీప్ చెప్పుకున్న ఇంటర్వ్యూస్ లో మాటలు మాత్రం కోటలు దాటించేలా కనిపిస్తుంది.. కానీ గడప దాటదు అనిపించాడు. అస్సలే మాత్రం రైటింగ్ బాలేదు.. డైరెక్షన్ బాలేదు. అసలే మాత్రం కొత్తదనం కనిపించకుండా ఉండేలా ఉన్నాడు. పైగా ఇందులో కూడా రాముడు, రావణుడు, ఆంజనేయుడు వంశాలు మాత్రం యాడ్ చేసుకుని ఆ ఆడియన్స్ ను మెప్పించాడు అన్నట్టుగా చేశాడు. బట్ ఆ మొత్తం కూడా బ్యాడ్ రైటింగ్. సింపుల్ గా చూస్తే.. ఈ సినిమా ఫెయిల్యూర్ మాత్రం డైరెక్టర్ దే అవుతుంది అని చెప్పాలి.
ఫైనల్ గా : మోగ్లీ .. పెద్దగా ఆకట్టుకోని సినిమా
రేటింగ్ : 2/5
బాబురావు కామళ్ల