"Wife" movie title launch : "వైఫ్" మూవీ టైటిల్ లాంచ్

Update: 2025-12-13 09:04 GMT

అధిరా టాకీస్ బ్యానర్ పై 100కు పైగా సినిమాలకు పని చేసిన సినిటారియ మీడియా వర్క్స్ సపోర్టుతో శ్రీనివాస్ (బుజ్జి) దర్శకత్వంలో నరేన్ తేజ్, సుహాన జంటగా నటిస్తూ మురళీకృష్ణ వర్మ సినిమాటోగ్రాఫర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వైఫ్. సత్య కాశ్యప్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి నందమూరి హరి ఎడిటింగ్ చేశారు. ప్రముఖ దర్శకుల ఆధ్వర్యంలో వైఫ్ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈరోజు వైఫ్ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన చిత్ర బృందం వాడికి నా ధన్యవాదాలు. ఇప్పటికే మీడియా వారి సపోర్ట్ చూస్తుంటే సినిమా మంచి విజయం సాధిస్తుందని అర్థమవుతుంది. ఈ చిత్రానికి సపోర్ట్ గా నిలిచిన సినిటారియ మీడియా వర్క్స్ వెంకట గారు సినిమాకు మరింత బలాన్ని అందిస్తారు. మ్యూజిక్ పరంగా కూడా మంచి సపోర్టు లభిస్తుంది. అటు భర్తకు ఇటు కుటుంబానికి బలంగా, పునాదిలా నిలబడే వైఫ్ టైటిల్ ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ సినిమాకు పని చేసిన అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అన్నారు.

ప్రముఖ డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరి జీవితాలలో వైఫ్ ఉంటారు. ఆ వైఫ్ ను టైటిల్ గా పెట్టారు. ఈ సినిమా కోసం ఎంతోమంది ప్రతిభవంతులు పనిచేస్తున్నారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ... "ఈ సినిమాకు బలం సినిటారియ మీడియా వర్క్స్ వెంకట గారు. అలాగే కే మ్యూజిక్ వారు ఈ సినిమా పాటలను కొనడం మరొక విశేషం. ఒక మంచి సినిమాలు ప్రేక్షకులకు చేరదీసే మాధ్యమం పబ్లిసిటీ. ఈ కార్యక్రమానికి విచ్చేసి సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దర్శకుడు బుజ్జికి అభినందనలు తెలియచేసుకుంటున్నాను" అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీనివాస్(బుజ్జి) మాట్లాడుతూ... "నా తల్లిదండ్రులకు, నా ఇష్టం దర్శకుడు రాంగోపాల్ వర్మ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుందాము. ఈ చిత్రం క్రైమ్ & సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రాబోతుంది. ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. త్వరలో మరొక మొదలు పెట్టబోతున్నాము. మీడియా వారంతా మా సినిమాకు సపోర్ట్ చేసిన కోరుకుంటున్నాను" అన్నారు.

సినిటారియ మీడియా వర్క్స్ సిఈఓ వెంకట్ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి జనరేషన్ కు తగ్గట్లు ఈ సినిమా ఉండబోతుంది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అన్నారు.

హీరోయిన్ సుహాన మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మా సినిమా వైఫ్ మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఈ చిత్రంలో నా పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని మరొక షెడ్యూల్ త్వరలో ప్రారంభించిపోతున్నాము. మా సినిమాకు మీరంతా సపోర్ట్ చేసి మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.

హీరో నరేన్ తేజ్ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. మీడియా సపోర్ట్ మా సినిమాకు చాలా అవసరం. ఎంతో ఫ్యాషన్తో ఐటీ రంగాన్ని వదిలేసి సినీ రంగంలోకి వచ్చాను. ఒక చక్కటి కథతో మా దర్శకులు బుజ్జి గారి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాము. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను" అన్నారు.

Tags:    

Similar News