Amala Paul : అమలా పాల్ మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్.. పోలీసులకు ఫిర్యాదు..
Amala Paul : అమలా పాల్‌ను తన మాజీ ప్రియుడే బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
Amala Paul : అమలా పాల్‌ను తన మాజీ ప్రియుడే బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో అమల అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోయిన్ అమలా పాల్ గతంలో గాయకుడు భవ్‌నిందర్‌తో డేటింగ్ చేసింది. దంపతులేమో అనేంతగా వారి సాన్నిహిత్యం నడిచింది. ఇద్దరూ కలిసి ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు. అమలా పాల్ భారీ మొత్తంలో అందులో పెట్టుబడి పెట్టింది. ఆ తరువాత కొంత కాలానికి ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చాయి. కంపెనీ డైరెక్టర్‌గా అమలాపాల్ పేరును భవ్‌నిందర్ తీసివేయించాడు. దీనిపై అమలా పాల్ అతన్ని ప్రశ్నించగా తనతో కలిసి ఉన్న ప్రయివేట్ ఫోటోలను వీడియోలను మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో అమలా పాల్ అతనిపై పోలీసులుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పవీందర్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేశారు. పవీందర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న 11 మంది పవీందర్ స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.