Amitab Batchan: ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో అమితాబ్‌కు గాయాలు..
Amitab Batchan: ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.;
Amitab Bachan: ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో బిగ్ బి గాయపడ్డారు. అతని కుడి పక్కటెముక కండరాలు చీలిపోవడంతో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డారు. గాయం నుంచి కోలుకోవడానికి వారాలు పడుతుందని, సినిమా షూటింగ్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని నటుడు తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. అమితాబ్ బచ్చన్ ముంబై వెళ్లే ముందు హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో CT స్కాన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
నన్ను కలవాలనుకుంటున్న శ్రేయోభిలాషులను నేను కలవలేను. దయచేసి రావద్దు. నేను బాగానే ఉన్నాను. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాను. అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ K గురించి
ప్రాజెక్ట్ K ఒక ఫాంటసీ డ్రామా, ఇందులో ప్రభాస్ కొత్తగా కనిపిస్తాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషిస్తోంది. ప్రాజెక్ట్ K 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.