నందమూరి బాలకృష్ణ మూవీ అఖండ 2 వాయిదా పడింది. ఈ మూవీ పోస్ట్ పోన్ కావడంపై చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ తో కారణంతోనే ఈ మూవీ వాయిదా పడింది అనేది ఖచ్చితంగా చెబుతున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్.. 14 రీల్స్ బ్యానర్ పై తీవ్రంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు కోర్ట్ ఇష్యూ కారణంగానే మూవీ వాయిదా పడింది. మరి కొత్త డేట్ ఏంటీ అనేది ఇప్పుడప్పుడే అయితే చెప్పలేకపోతున్నారు మేకర్స్. ఇలా ఓ పెద్ద హీరో సినిమా వాయిదా పడటం మాత్రం చాలా రేర్ గా జరుగుతోంది. అయితే అఖండ 2 రూట్ లో ఇప్పుడు అన్నగారు వస్తారు మూవీ కూడా యాడ్ కాబోతోందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
కార్తీ హీరోగా నటించిన మూవీ వా వాథియార్. నలన్ కుమారస్వామి డైరెక్ట్ చేసిన మూవీ ఇది. అయితే ఈ మూవీ నిర్మాత జ్ఞానవేల్ రాజాతో ఫైనాన్షియర్ అర్జున్ సుందర్ లాల్ గొడవకు దిగాడు. వీరి మధ్య ఫైనాన్షియల్ ఇష్యూస్ జరిగాయి.దీంతో అర్జున్ సుందర్ లాల్ కోర్ట్ ను ఆశ్రయించాడు. వీళ్లు 10 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నట్టుగా చెబుతున్నారు. దీనికి వడ్డీకి కలిపి మరీ 22 కోట్ల వరకు అయిందట. 22 కోట్లు చెల్లించాలి అని కోర్ట్ ను కోరాడు. విచారణ చేసిన కోర్ట్ ను ఈ నెల 8కి వాయిదా వేసింది.
ఓ వైపు చూస్తే సినిమా 12నే విడుదల కాబోతోంది. ఈ టైమ్ కు రిలీజ్ కావడమా లేదా అనేది ఫైనాన్షియర్స్ చేతిలో ఉంది. ఆ మొత్తం చెల్లించడం లేదంటే రాజీకి చేసే ప్రయత్నం జరిగితే కానీ ఈ డేట్ కు రిలీజ్ అవుతుంది. లేదంటే ఖచ్చితంగా వా వాథియార్ మూవీ కూడా విడుదల కావడం జరగదు. నిజానికి ఈ ఇష్యూలో ముందుగానే వీళ్లు రిలీజ్ డేట్ చేసి ఉండాల్సింది. ఆ కారణాలతోనే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. లేదంటే సినిమా విడుదలై దాదాపు ఆరు నెలలే అవుతుంది. ఇంత లేట్ గా వస్తున్నా కూడా వీళ్లు ఆ సమస్యను పరిష్కరించలేదు అని తేలింది. మరి ఈ నెల 8న అయినా ఈ మూవీ ఇష్యూ క్లియర్ అవుతుందా లేక పోస్ట్ పోన్ అవుతుందా అనేది చూడాలి.