Tollywood : పదేండ్ల తర్వాత ఆనందం బ్యూటీ రీఎంట్రీ !

Update: 2025-08-23 08:45 GMT

శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆనందం మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రేఖ. మొదటి సినిమాతోనే ఎంతో మందిని మెప్పించిన ఈ భామ తర్వాత తెలుగులో దొంగోడు, ఒకటో నెం. కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి హిట్ సినిమాల్లో కనిపించింది. కానీ కొంత కాలానికి టాలీవుడ్ కు దూరమై లైమ్ లైట్ లో కనిపించకుండా పోయింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన రేఖకు అదే టైమ్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు మొదలయ్యాయి. కానీ 2014 తర్వాత ఈ భామ వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలతో రెస్టు తీసుకోవాలని నిర్ణయించుకుని పరిశ్రమకు దూరమైంది. అలాంటి రేఖ ఇప్పుడు యాక్టింగ్ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది. టాలీవుడ్లో కంబ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నటిగా తనను చాలెంజ్ చేసే పాత్రల కోసం ఆమె వెతుకుతుందట. సినిమాల్లోనే కాకుండా ఓటీటీ షోలలో ఐదైనా పవర్ఫుల్ రోల్స్ ఉన్నప్పటికీ చేయడానికి సై అంటోందీ భామ. అందుకే ఆమె రీసెంట్ గా తన పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి.. ఫ్యాన్స్ కు రెగ్యులర్ టచ్లో ఉంటుంది.

Tags:    

Similar News