నటి అనన్య నాగళ్ళ నెటిజన్స్ పై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె చేసిన వీడియోపై ట్రోలింగ్ జరగడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం అనన్య నాగళ్ల స్ట్రా లేకుండా కొబ్బరి బొండాం తాగుతూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాధారణంగా తాను స్టీల్ స్ట్రాను తన వెంట తెచ్చుకుంటానని, అది లేనప్పుడు ఇలా డైరెక్ట్‌గా కొబ్బరి నీళ్లు తాగుతానని, ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గిద్దామని చెప్పింది. ఆ వీడియోపై చాలామంది పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వగా, కొంతమంది మాత్రం అనన్య నాగళ్లపై విమర్శలు చేశారు. ఆ కామెంట్లు చూసి నొచ్చుకున్న అనన్య నాగళ్ల మరో వీడియోలో తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండానికి ఓ వీడియో చేశాను. అందులో తప్పేముంది. చిన్న విషయం చెప్పా నచ్చితే చేయండి లేకపోతే లేదు సింపుల్ కదా. అని చెప్పింది అనన్య. ప్రస్తుతం అనన్య చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.